Chandrababu And Jagan: ఏపీలో జగన్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జాతీయస్థాయిలో ఏదో ఒక కూటమితో వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అక్రమాస్తుల కేసులతో పాటు వివేకానంద రెడ్డి హత్య కేసు తెరపైకి వస్తోంది. ఇప్పటికే అక్రమాస్తుల కేసు విచారణకు వచ్చింది. విచారణలో జరుగుతున్న జాప్యం పై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు మరింత పురోగతి సాధించే అవకాశం ఉంది. అదే జరిగితే జగన్ కు ఇబ్బందికర పరిణామమే. మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసు తెరపైకి వస్తోంది. వివేక కుమార్తె సునీత రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను కలిశారు. కేసు పురోగతిని వివరించారు. వీలైనంత త్వరగా కేసు విచారణను పూర్తి చేసి నిందితులను అరెస్టు చేయాలని కోరారు. అయితే ఈ పరిణామాలన్నీ జాతీయ రాజకీయాలతో ముడిపడి జరిగినవే. జాతీయ రాజకీయాలను టార్గెట్ చేసుకొని చంద్రబాబుతో పాటు జగన్ మైండ్ గేమ్ ఆడటం ప్రారంభించారు. అందుకే ఈ శరవేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక దానికి ఒకటి లింక్ అన్నట్టు పరిణామాలు ఉన్నాయి. వీటన్నింటి లింకు ఢిల్లీలో ఉంది. గత ఐదు సంవత్సరాలుగా జగన్ అక్రమాస్తుల కేసు కదలిక లేదు, వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో జాప్యం కొనసాగింది. కేవలం కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వైసీపీ సాగినందునే ఈ రెండు కేసుల్లో ఫేవర్ కనిపించింది. అయితే ఎన్నికల అనంతరం సైతం వైసిపి సాయం చేస్తే తీసుకునేందుకు బిజెపి సిద్ధంగా ఉంది. కానీ బిజెపి టిడిపి టిడిపి మిత్రపక్షంగా ఉంది. అందుకే జగన్ ఇబ్బందులు వస్తాయని తెలిసి జాతీయస్థాయిలో ఇండియా కూటమి వైపు అడుగులు వేయడం ప్రారంభించారు.
* ఇండియా కూటమి వైపు అడుగులు
ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయంటూ ఢిల్లీలో ధర్నా చేపట్టారు జగన్. ఇండియా కూటమిలో దాదాపు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. తాజాగా వక్ఫ్ బిల్లును వ్యతిరేకించింది వైసిపి. ఇండియా కూటమి పక్షాలతో కలిసి గళమెత్తింది. తాను ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. బిజెపికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అందులో భాగంగా తరచూ బెంగళూరు పర్యటన చేస్తున్నారు జగన్. డీకే శివకుమార్ ద్వారా పావులు కదుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
* బిజెపి నుంచి సానుకూలత లేదు
మొన్న ఆ మధ్యన వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. జగన్ పై అక్రమాస్తుల కేసులతోపాటు వివేకానంద రెడ్డి హత్య కేసుల విషయంలో ఫేవర్ చేయాలని చివరి అస్త్రంగా ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే అమిత్ షా నుంచి ఆశించినంతగా సానుకూలత రాలేదు. అందుకే ఇప్పుడు పార్లమెంటులో ఇండియా కూటమి ప్రతినిధులతో వైసీపీ ఎంపీలు గొంతు కలిపినట్లు తెలుస్తోంది.
* ఆ ప్రయత్నాలకు ఎసరు
ఇంకోవైపు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ను కలిశారు. కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతోనే వివేక హత్య కేసును వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.కానీ ఈ చర్యలను అడ్డుకునేందుకు చంద్రబాబు సైతం పావులు కదపడం ప్రారంభించినట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ కు జగన్ దగ్గర అయితే తెలంగాణలో కాంగ్రెస్ కు, ఏపీలో టిడిపికి ఇబ్బందులు తప్పవని పవన్ చేత రాయబారం పంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఏనుగుల వ్యవహారంలో కర్ణాటక సీఎంను పవన్ కలిసిన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ ఇలా వెళ్లి వచ్చారో లేదో.. ఇప్పుడు జగన్ బెంగుళూరు వెళ్తున్నారు. దీంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Chandrababu and jagan are influencing delhi politics from bangalore
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com