Homeఆంధ్రప్రదేశ్‌Polavaram project latest update: పోలవరం ప్రాజెక్టుపై బిగ్ అప్డేట్!

Polavaram project latest update: పోలవరం ప్రాజెక్టుపై బిగ్ అప్డేట్!

Polavaram project latest update: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై కీలక అప్డేట్ వచ్చింది. మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని.. అదే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జల శక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసిన తరువాత మంత్రి రామానాయుడు ప్రకటన చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా పోలవరం ప్రాజెక్టును భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నత్తనడకన పనులు సాగాయి. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగవంతం అయ్యాయి. ఏడాది కాలంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది పోలవరం. ఎప్పటికప్పుడు మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు సైతం నిత్య పరిశీలనలతో పాటు సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేయిస్తున్నారు. ఏడాది కాలంలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది అని తెలుస్తుండడం మాత్రం శుభ పరిణామం.

నదులను అనుసంధానిస్తూ..
గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. అయితే 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. ప్రారంభంలో రామ పాద సాగర్ గా పిలవబడిన ఈ పథకాన్ని పోలవరం ప్రాజెక్టు గా మార్చారు. 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నదీ ప్రవాహానికి కుడివైపున ఒక స్పిల్ వే నిర్మించారు. ఈ స్టిల్ వేకు అడ్డంగా 48 గేట్లతో ఒక బ్యారేజీ నిర్మాణం చేపడుతున్నారు. నదీ ప్రధాన ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట నిర్మించి.. ఆ ప్రవాహాన్ని కుడివైపున ఉన్న స్కిల్ వేలోకి మళ్ళిస్తారు. ఈ ప్రాజెక్టుకు గేట్లు ఉండవు. కేవలం రాక్ ఫీల్డ్ డ్యామ్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టులో 1118 మీటర్ల పొడవు ఉండే స్పిల్ వే ప్రత్యేకమైనది.

రెండు దశాబ్దాల కిందట..
దాదాపు 22 సంవత్సరాల కిందట పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్టుకు గుర్తింపు లభించింది. 2015లో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. పోలవరం జాప్యం జరగడంతో పట్టిసీమను తెరపైకి తెచ్చారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. 2015 లోనే దాదాపు 1300 కోట్లు ఖర్చు పెట్టి తొలి విడతగా పూర్తి చేశారు. అయితే మరో ఏడాది కాలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసి… ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా పనులు చేయిస్తున్నారు. మరో ఏడాదిలో పోలవరం ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుండడం మాత్రం నిజంగా శుభ పరిణామం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version