Amaravati: రాజధాని అంటేనే పాలనా కేంద్రం. రాజధాని అద్భుతంగా ఉంటేనే పెట్టుబడులు వచ్చేది. అయితే ఏదైనా ఒక నగరాన్ని రాజధానిగా ఎంపిక చేస్తే అది సాధారణమే. కానీ నగరాన్ని నిర్మించి రాజధానిగా మారిస్తే అది అద్భుతమే. ఇప్పుడు అటువంటి ఘనతను సాధించింది అమరావతి( Amaravati capital). నవ నగరాలను కలిపి అమరావతిగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు ప్రణాళిక. ఇటు గుంటూరు, అటు విజయవాడ.. మధ్యలో అమరావతిని అభివృద్ధి చేసి ప్రపంచ నగరాల్లో ఒకటిగా నిలపాలన్నది ఆయన లక్ష్యం. ప్రారంభంలో బాలారిష్టలు వస్తాయి. అవి సర్వసాధారణం కూడా. అయితే ఇప్పుడు వాటన్నింటిని అధిగమించి ముందుకు సాగుతోంది అమరావతి. అయితే నిన్న జరిగిన బ్యాంకు కార్యాలయాల శంకుస్థాపనతో అమరావతికి కొత్త రూపు వచ్చింది. ఆ బ్యాంకుల నమూనా చూస్తుంటే సరికొత్త ఆవిష్కృతంగా కనిపిస్తోంది. రెండేళ్లలో ఈ బ్యాంకు కార్యాలయాలు అందుబాటులోకి వస్తే మాత్రం అమరావతికి ఒక కొత్త శోభ తప్పదు.
* శరవేగంగా పనులు..
అమరావతి నిర్మాణం ప్రారంభమై చాలా రోజులు అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి వేలాది కార్మికులు, ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. కానీ 50 ఎకరాల విస్తీర్ణంలో నిన్న రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం తో పాటు 25 బ్యాంకులకు సంబంధించిన భవనాలకు శంకుస్థాపన జరిగింది. బ్యాంకు కార్యాలయాలు కావడంతో రెండేళ్లలో వీటి నిర్మాణం పూర్తి కావడం ఖాయం. అయితే వాటి నమూనాలను చూస్తుంటే మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అమరావతిలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే ఈ బ్యాంకులన్నీ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉండడంతో.. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం అయినట్టు ఉంది అమరావతి నిర్మాణంలో.
* గొప్ప అదృష్టం..
దేశంలో ఏ రాజధానికి దక్కని అదృష్టం అమరావతి దక్కించుకుంది. ఎక్కడైనా రాజధాని లో ఖాళీ స్థలం చూసి బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాల నిర్మాణం జరగడం ఆనవాయితీగా వస్తోంది. కానీ బ్యాంకులన్నీ ఒకే చోట ఉండడం మాత్రం అరుదైన విషయం. అందున ప్రాంతీయ కార్యాలయాలు అంటే ఎక్కడో ఒకచోట సర్దుబాటు జరుగుతూ ఉంటుంది. కానీ అమరావతిలో మాత్రం అన్ని బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట ఉండడం.. అది కూడా ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోనే ఉండడం మాత్రం అద్భుతం గానే చెప్పవచ్చు. బ్యాంకింగ్ సెక్టార్ అనేది ఏ రాష్ట్రానికి అయినా ఒక ఆభరణమే. ఎందుకంటే అన్ని అంశాలకు మూలం ఆర్థికం. అటువంటి ఆర్థిక బ్యాంకులన్నీ ఒకే ప్రాంతంలో నిర్మితం కావడం అనేది శుభ పరిణామం. అది ముమ్మాటికి అమరావతికి మణిహారం.
* కేంద్ర సహకారం పై సంకేతం..
ఇంతవరకు అమరావతిలో నేరుగా పాలుపంచుకోలేదు కేంద్ర ప్రభుత్వం. మధ్యలో అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు విచ్చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. 2017లో కూడా అలానే వచ్చారు. అలాగని జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను కేంద్రం అడ్డుకోలేదు కదా. అందుకే పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేసిన ఏదో ఒక మూలన అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాల ప్రారంభోత్సవం కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతి ఇచ్చినట్లు అయింది. నిజంగా ఇది శుభ పరిణామం. కేంద్ర సహకారంతో అమరావతి సాకారం కావడంతో ఖాయమని తేలిపోతుంది. ఇకపై అమరావతికి అడ్డులేదని తెలుస్తోంది.