Tirumala Tour:తిరుమల తిరుపతి దేవస్థానికి వెళ్లే భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ మరో ఆఫర్ ప్రకటించింది. శ్రీవారి దర్శనంలో ఇబ్బందులు తొలగించి సులభంగా దర్శనం చేసుకునేందుకు భక్తులకు మార్గం సుగమం చేస్తోంది. దీని కోసం ఎప్పుడు వినూత్న పథకాలు తీసుకురావడం తెలిసిందే. శ్రీవారి దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ముందంజలో ఉంటోంది. ఇదివరకే ఎన్నో స్కీములు తీసుకొస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.

తిరుమల-తిరుపతికి టికెట్ బుక్ చేసుకున్న వారికి రావడానికి పోవడానికి కలిపి ఒకే టికెట్ ఇస్తున్నారు. దీనిపై 10 శాతం రాయితీ ఇస్తోంది. దీంతో ప్రయాణికులు మేలు జరుగుతోంది. ప్రయాణికుల కోసమే ఈ ఆఫర్ తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. తిరుపతికి బస్ టికెట్ బుక్ చేసుకున్న వారికి తిరుమలకు కూడా రాకపోకలకు టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. దీంతో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండనుంది.
తిరుపతి వచ్చాక ఈ టికెట్ 72 గంటల పాటు చెల్లుబాటు అవుతుందని చెబుతున్నారు. ఇది భక్తులకు ఓ వరంగా భావిస్తున్నారు. దీంతో ఆర్టీసీ కల్పించిన అవకాశం భక్తులకు సమయాన్ని ఆదా చేస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి వెళ్లే భక్తులకు ఇది సువర్ణావకాశంగా చెబుతున్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
ఈ ఆఫర్ ఫిబ్రవరి 3 నుంచి అందుబాటులోకి వచ్చింది. భక్తులు కరోనా వైరస్ విస్తరిస్తున్న సందర్భంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు. మొత్తానికి ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం కోసం మరిన్ని పథకాలు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.
[…] Naga Chaitanya: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య – స్టార్ హీరోయిన్ సమంత విడాకుల పై అందరూ స్పందించారు. కానీ, ఇటు చై, అటు సామ్ ఈ అంశం పై లోతుగా మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడలేదు. అయితే, ఈ విషయం పై చైతు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మేము విడాకులు తీసుకున్నాక సంతోషంగా ఉన్నాం. నేను హ్యాపీగా ఉన్నాను, మా ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అంటూ చైతు క్లారిటీ ఇచ్చాడు. […]