https://oktelugu.com/

Pawan Kalyan: ఆఫ్రికన్ దేశాలకు ఏపీ రేషన్ బియ్యం.. పవన్ ఇప్పుడు ఏం చేస్తారో?*

ఏపీ నుంచి రేషన్ బియ్యం రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టినా.. నియంత్రించలేకపోతోంది. ఈ తరుణంలో రేషన్ బియ్యం తో సౌత్ ఆఫ్రికా వెళ్తున్న షిప్ ను కాకినాడ అధికారులు అడ్డుకున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 29, 2024 / 12:34 PM IST

    Deputy  CM Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan: వైసిపి హయాంలో కాకినాడ పోర్టు ద్వారా భారీగా బియ్యం తరలిపోతున్నాయని అప్పట్లో కూటమి నేతలు ఆరోపించారు. దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారన్నది అప్పట్లో కూటమి నేతల నుంచి వినిపించిన మాట.అయితే ఇప్పటికీ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. గతంలో కాకినాడ పోర్టులో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వరుస తనిఖీలు కూడా చేశారు. అయినా సరే ఎటువంటి మార్పు రాలేదు. తాజాగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యంతో వెళ్తున్న ఓ సౌతాఫ్రికా షిప్ ను కాకినాడ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ పట్టుకున్నారు. షిప్ లో దాదాపు 640 టన్నుల అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ షిప్ పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్ళనున్నారు. సౌత్ ఆఫ్రికా షిప్ తో పాటు లాంచీలో వేలాది టన్నుల బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.దీంతో దానిని కూడా పవన్,మనోహర్ లు కలిసి పరిశీలించనున్నారు. ప్రభుత్వం ఎన్ని రకాల కట్టడి చర్యలు చేపట్టినా రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు బియ్యం మాఫియా తరలిస్తూనే ఉంది. ముఖ్యంగా కాకినాడ కేంద్రంగా ఈ దందా నడుస్తూనే ఉంది.

    * చర్యలకు పవన్ ఆదేశాలు
    తాజాగా ఈ బియ్యం తరలింపు వెనుక లవన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ సంస్థను గుర్తించారు. పవన్ స్వయంగా రంగంలోకి దిగుతుండడం సంచలనం అవుతోంది. అక్కడికక్కడే దీనిపై అధికారులకు ఆదేశాలు ఇవ్వబోతున్నారు పవన్. దీంతో పవన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కాకినాడ పోర్టు నుంచి బియ్యం తరలింపు పై చాలా సందర్భాల్లో మాట్లాడారు పవన్. ఇప్పుడు అధికారిక హోదాలో అక్కడకు వెళ్తున్నారు. దీంతో పవన్ ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతారో అన్న చర్చ నడుస్తోంది.

    * గతం నుంచి దందా
    అయితే కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం తరలింపు ఇప్పటిది కాదు. గతం నుంచి కూడా ఈ దందా కొనసాగుతూనే ఉంది. వివిధ జిల్లాల నుంచి రేషన్ బియ్యం రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకుంటుంది. అనంతరం నౌకల ద్వారా విదేశాలకు తరలిపోతుంది. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలకు ఈ బియ్యం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది.