AP Rains: వేసవిలో( summer ) ఏపీకి చల్లటి కబురు. మరో మూడు రోజుల పాటు ఏపీవ్యాప్తంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. మంగళవారం నుంచి గురువారం వరకు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక ప్రకటన జారీచేసింది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల ప్రజలకు కీలక సూచనలు చేసింది. పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అదే సమయంలో కొన్ని జిల్లాలకు వర్ష సూచన ఉంది. ప్రధానంగా మంగళవారం నుంచి వాతావరణ భిన్న పరిస్థితులు ఉంటాయని తేల్చి చెప్పింది.
Also Read: దళిత యువకుడికి చంద్రబాబు షాక్.. అలా చేశారేంటి?
* ఉత్తరాంధ్రకు వర్ష సూచన..
రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మంగళవారం( Tuesday) వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
* మూడు రోజులపాటు ఉరుములతో వర్షాలు..
వచ్చే మూడు రోజులు ఏపీలో( Andhra Pradesh) కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు అమరావతి వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు, మరి కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు కోస్తాంధ్ర మధ్య ప్రాంతం, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం బలహీన పడిందని తేలింది. అయితే దాని ప్రభావంతో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాలో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని.. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.
* రాయలసీమలో ఉష్ణోగ్రతలు..
అయితే ఇప్పటికే రాయలసీమలో( Rayalaseema ) ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. కానీ అక్కడ కూడా అల్పపీడన ప్రభావం ఉంటుందని తాజాగా తెలుస్తోంది. దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చాలాచోట్ల అకాల వర్షాలు పడ్డాయి. రైతులకు ఇబ్బందులు తప్పలేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు దెబ్బతినడంతో రైతులు ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
Also Read: వక్ఫ్ బిల్లుకు అనుకూల ఓటింగ్.. కోర్టులో పిటిషన్.. వైసిపి ద్వంద వైఖరి