AP News : ఆంధ్రప్రదేశ్ కు( Andhra Pradesh) కేంద్రం శుభవార్త చెప్పింది. పెద్ద ఎత్తున ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. జనాభా ప్రాతిపదికన రూ. 1120 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు గ్రామపంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు కేటాయిస్తారు. జనాభా ప్రాతిపదికన కేటాయింపులు ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటన నేపథ్యంలోనే ఈ నిధులు విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మే 2న ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. అంతకంటే ముందే భారీగా ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం మాత్రం ఏపీకి శుభవార్త.
Also Read : తీవ్ర అసంతృప్తితో ఆ టిడిపి సీనియర్ ఎమ్మెల్యే!
* స్థానిక సంస్థలకు వాటాలు..
సాధారణంగా ఆర్థిక సంఘం నిధులలో( finance funds ) గ్రామపంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20% నిధులు కేటాయిస్తారు. జిల్లా పరిషత్తులకు 10 శాతం నిధులు జమ చేస్తారు. ఆయా గ్రామపంచాయతీలలో బ్యాంక్ అకౌంట్ లలో జనాభా ప్రాతిపదికన ఈ నిధులు ఆర్థిక శాఖ అనుమతితో.. పంచాయితీ రాజ్ శాఖకు జమ చేయనుంది. రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ కింద ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఈ నిధులు కేటాయింపులు చేస్తుంది. అయితే ఇది రాజ్యాంగబద్ధ చెల్లింపులు కూడా. కానీ గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ నిధులు పక్కదారి పట్టాయి అన్న విమర్శలు ఉన్నాయి. పథకాలకు మళ్ళించారన్న ఆరోపణలు ఉన్నాయి.
* రెండు రూపాల్లో నిధులు
ఆర్థిక సంఘం గ్రాంట్లు టైడ్, అన్ టైడ్ రూపంలో విడుదల చేస్తారు. అన్ టైడ్ గ్రాంట్ లను జీతాలు బెనహ మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక సంస్థలు వాడుకోవచ్చు. టైడ్ గ్రాంట్ లను పారిశుద్ధ్యం, నీటి నిర్వహణ, ఓడిఎఫ్ పనులు, వర్షపు నీటి పునర్ వినియోగం, వాటర్ రీసైక్లింగ్ వంటి పనులకు ఉపయోగించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు వినియోగిస్తారు. ఇప్పటికే ఆర్థిక సంఘం తొలి విడత నిధులు విడుదల చేయగా.. తాజాగా విడుదల చేసిన నిధులు రెండో విడతకు చెందినవి.
* సీఎం ఢిల్లీ పర్యటన తర్వాత..
ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) ఢిల్లీ పర్యటన తరువాత రోజునే ఈ నిధులు విడుదల చేయడం విశేషం. మొన్ననే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. ప్రధానితో సమావేశమయ్యారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వరుసగా కేంద్ర మంత్రులను కలిశారు. పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. ఈ క్రమంలోనే ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం విశేషం.
Also Read : ఆ జిల్లా టిడిపి సీనియర్లలో అసంతృప్తి.. కారణం అదే!