AP DSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి గన్ రెడ్డిల పాలనల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది.డీఎస్సీ నోటిఫికేషన్లపై విద్యార్థుల ఆందోళనలు తలెత్తుతున్నాయి.ఉపాధ్యాయ నియామకాల విషయంలో ప్రభుత్వాల చిత్తశుద్ధి ఎంత?.. డీఎస్సీ నోటిఫికేషన్లు, ఉపాధ్యాయుల భర్తీ విధానంలో ఇద్దరి పాలనల్లోని తేడాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read: ఏపీలో పారిశ్రామిక ప్రగతి.. తట్టుకోలేకపోతున్న వైసిపి.. విష ప్రచారం!
చంద్రబాబు నాయుడు హయాంలో డీఎస్సీ
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన హయాంలో 11 సార్లు డీఎస్సీ నిర్వహించారు. దీని ద్వారా 1,80,208 మంది ఉపాధ్యాయులను నియమించారు. 2014-2019 మధ్యకాలంలోనే 18 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించి, ఎంపికైన అభ్యర్థులకు రెండు నెలల్లోనే పోస్టింగ్‌లు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు హయాంలో నియమితులైన వారే.
జగన్ రెడ్డి హయాంలో డీఎస్సీ
జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ గురించి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఎన్నికల సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక దానిని పూర్తిగా విస్మరించారు. జంబో డీఎస్సీ, మెగా డీఎస్సీ అంటూ ఐదేళ్లపాటు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. 2024 ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదలైన నెల రోజుల్లోనే పరీక్షలు నిర్వహించాలనే నిబంధన పెట్టారు. తన ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా విడుదల చేయలేదు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్‌లను కలిపి ఇచ్చి అభ్యర్థుల్లో అయోమయం సృష్టించారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు కాపలా పెట్టించారు. అప్రెంటీస్ విధానం ద్వారా రెండేళ్లపాటు ఉపాధ్యాయుల పొట్ట కొట్టారు.
చంద్రబాబు నాయుడు హయాంలో ఉపాధ్యాయ నియామకాలకు ప్రాధాన్యత ఇవ్వగా, జగన్ రెడ్డి హయాంలో మాత్రం ఉపాధ్యాయుల నియామకాలను విస్మరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు. డీఎస్సీ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణలో కూడా స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్లు క్రమం తప్పకుండా విడుదల చేయగా, జగన్ రెడ్డి హయాంలో మాత్రం ఎన్నికల ముందు హడావిడిగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
Also Read: ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి.. అమిత్ షా తో చంద్రబాబు భేటీ!