spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Coalition Government Achievements: రెండేళ్ల కూటమి పాలన.. పురోగమనంలో ఏపీ!

AP Coalition Government Achievements: రెండేళ్ల కూటమి పాలన.. పురోగమనంలో ఏపీ!

AP Coalition Government Achievements: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఈరోజు రెండేళ్లు అవుతుంది. 2024 జూన్ 4న ఫలితాలు వచ్చాయి. 12న ప్రభుత్వం కొలువుదీరింది. ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంకుశ భయాందోళనలు, రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం, వ్యవస్థాగత ఆర్థిక అరాచకాల చీకటి నీడల నుంచి నవ్యాంధ్ర సమాజం పూర్తి ఊపిరి పీల్చుకుంది. గత రెండేళ్ల కాలంలో సుపరిపాలనతో పాటు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యమిస్తూ పాలన సాగింది. గాడిన తప్పిన పాలనా వ్యవస్థను మెరుగుపరుచుతూనే పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా.. అభివృద్ధి పనులు చేయడం ద్వారా.. ఏపీ కొంతవరకు పట్టాలు ఎక్కింది. ఈ రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయం సామాన్యుడిని పాలకుల నిఘా నీడల నుంచి విముక్తి చేయడం. గతంలో ప్రతి పౌరుడి వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లేది. వాలంటీర్ల వ్యవస్థతో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి.

* పెద్ద ఎత్తున పెట్టుబడులు..
రెండేళ్ల కూటమిపాలనలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం అనేది ప్లస్ పాయింట్. సీఎం చంద్రబాబు తన గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ తో ఏపీని మళ్లీ అంతర్జాతీయ ఇన్వెస్టర్ల స్వర్గధామంగా మార్చారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, సీఎంఐఈ తాజా ఆర్థిక నివేదికల ప్రకారం.. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడుల ప్రతిపాదనలో ఏకంగా 25 శాతం సింహభాగం ఏపీ దక్కించుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సరికొత్త పారిశ్రామిక విధానాలు, ఎకానమిక్ కారిడార్ల ఏర్పాటుతో గడిచిన రెండేళ్ల కాలంలో ఏపీకి ఏకంగా 23 లక్షల కోట్ల మేర భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం కలిగింది.
* విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అనేది గేమ్ చేంజర్ గా నిలిచింది. ఏకంగా 1.3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. మరోవైపు రిలయన్స్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో 98 వేల కోట్లతో మరో భారీ డేటా సెంటర్ రాబోతోంది.
* రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. ప్రముఖ ఇంధన సంస్థ ఏబీసీ క్లీన్ టెక్ సుమారు లక్ష కోట్ల పెట్టుబడులతో ప్రతిష్టాత్మక గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసింది. క్లీన్ ఎనర్జీ, హైటెక్నాలజీ మౌలిక వస్తువుల కలయికతో లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తూ.. 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి ప్రతిపాదితంగా రాడం అనేది గొప్ప విషయం.
* పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఓటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్ర వ్యవసాయ రంగానికి వెన్నెముకగా ఉన్న ఈ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పేరుతో వైసిపి హయాంలో ఇబ్బంది పడింది. నాటి అనాలోచిత నిర్ణయాల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం, గైడ్ బండ్ కుంగిపోవడం ప్రాజెక్టు భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా మార్చింది. కూటమి అధికారంలో రాగానే దిద్దుబాటు చర్యలు ప్రారంభం అయ్యాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో నిధులకు సంబంధించిన ఇబ్బందులు తీరాయి. జియో టెక్నికల్ పనులు వేగంగా పూర్తయ్యాయి.
* పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కూటమి ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంతం తో పాటు ఉమ్మడి గోదావరి, విశాఖ జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చ నుంది ఈ ప్రాజెక్టు.
* అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో మూడు రాజధానులతో అమరావతి నిర్వీర్యం అయింది. కూటమి వచ్చిన తర్వాత వేలకోట్ల రూపాయల అంతర్జాతీయ పెట్టుబడులతో మళ్ళీ జీవం పోసుకుంది. కేంద్ర ప్రభుత్వం సైతం 15 వేల కోట్ల రూపాయల సాయాన్ని సర్దుబాటు చేసింది. ప్రపంచ బ్యాంకు తోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా నిధులను సర్దుబాటు చేసింది. మెగా కన్వెన్షన్ సెంటర్లు, ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణాన్ని కూడా అనుమతులు మంజూరయ్యాయి.
* వైసిపి హయాంలో రహదారులు దారుణంగా ఉండేవి. నరకాన్ని తలపించేవి. ఆంధ్రప్రదేశ్ రహదారుల రూపురేఖలు మార్చేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. కేవలం ప్రాథమిక దశలోనే రోడ్లు భవనాల శాఖ పరిధిలోని రహదారుల మరమ్మత్తులకు ఏకంగా 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. రికార్డ్ స్థాయిలో పనులు పూర్తి చేసింది. అద్వానపు రోడ్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది.
* నిజమైన సంక్షేమం అంటే కేవలం అప్పులు తెచ్చి బట్టలు నొక్కడం కాదు అని నిరూపించారు సీఎం చంద్రబాబు. ప్రాధాన్యత క్రమంలో సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించింది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దాదాపు అన్నింటిని అమలు చేసి తన చిత్తశుద్ధిని చాటుకుంది.
* తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకార భరోసా.. ఇలా దాదాపు అన్ని పథకాలను పూర్తి చేసి సంక్షేమ రాజ్యాన్ని తలపించింది ఏపీలో కూటమి ప్రభుత్వం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version