Homeఆంధ్రప్రదేశ్‌AP Assembly Sessions 2025: అసెంబ్లీకి వస్తా కానీ.. ఆ ఒక్క కండిషన్ పెడుతున్న జగన్

AP Assembly Sessions 2025: అసెంబ్లీకి వస్తా కానీ.. ఆ ఒక్క కండిషన్ పెడుతున్న జగన్

AP Assembly Sessions 2025: ఏపీలో( Andhra Pradesh) నిన్న రోజంతా ఉత్కంఠ కొనసాగింది. అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని రోజంతా ప్రచారం నడిచింది. దీంతో రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సభకు హాజరు కాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఒకసారి.. గవర్నర్ ప్రసంగం రోజు ఒకసారి మాత్రమే సభకు హాజరయ్యారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభలో అడుగు పెడతానని తేల్చి చెప్పారు. అయితే సభకు హాజరు కాకపోవడం పై అనేక రకాలుగా విమర్శలు వచ్చాయి. దీంతో వ్యూహాత్మకంగా జగన్ సభకు హాజరయ్యేందుకు నిర్ణయించారని ప్రచారం జరిగింది. అదే సమయంలో నిన్న ఆయన ఎమ్మెల్యే లతోపాటు ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎమ్మెల్యేలు అందరితోపాటు మీకు సమయం ఇస్తామని చెబుతున్నారని.. కానీ కొన్ని నిమిషాలు సమయం ఇస్తే ఏం మాట్లాడగలనని జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలతో అన్నట్లు తెలుస్తోంది. సభకు హాజరు అవుతామని వైసిపి ఎమ్మెల్యే ఒకరు అనడంతో జగన్ ఒక్కసారిగా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.

* రోజంతా ఉత్కంఠ..
అయితే జగన్( Y S Jagan Mohan Reddy ) హాజరు కాకపోయినా కొంతమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారని ప్రచారం సాగింది. అయితే వైసిపి సమావేశంలో దీనిపై హాట్ హాట్ గా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సభకు హాజరైతే మంచిదని ఓ ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని చెప్పగా.. నీతో పాటు మరికొందరిని తీసుకెళ్లి స్పీకర్ను కలవాలని.. తగిన సమయం ఇవ్వాలని కోరాలని.. సభలో మాట్లాడేందుకు కొంత సమయం ఇప్పిస్తే తాను సభకు హాజరవుతానని జగన్ ఆ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. స్పీకర్ను అలా ఒప్పించగలిగితే ప్రతిపక్ష నేత హోదాతో సంబంధం లేకుండా రేపే సభకు హాజరవుతానంటూ జగన్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. సభకు వస్తే మాట్లాడే అవకాశం ఇస్తామని చెబుతారని.. ఏరా అక్కడకు వెళ్లాక అవమానిస్తారు అన్నది జగన్ మాటగా తెలుస్తోంది.

* ఎమ్మెల్యే ప్రశ్నించేసరికి..
అయితే వైసీపీ సమావేశంలో ఎమ్మెల్యేల నుంచి ఆ అభిప్రాయం రాగానే జగన్మోహన్ రెడ్డిలో ఒక రకమైన చేంజ్ కనిపించినట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళితే తనకు అభ్యంతరం లేదని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Ramachandra Reddy ) నేతృత్వంలో ఎమ్మెల్యేలు సభకు వెళ్లాలని.. తనకు ఎంత మాత్రం అభ్యంతరం లేదని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. సభకు హాజరయ్యేందుకు ఇష్టపడలేదు. దీంతో ఆ అంశం మరుగున పడిపోయింది. ఇక ఈ మూడున్నర ఏళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లరని తేలిపోయింది. ఏకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టత ఇవ్వడంతో ఇక జగన్ సభకు దూరమేనని తేలిపోయింది.

* అవమానాలకు భయపడి..
సభకు హాజరైతే జరిగే అవమానాలు, అడ్డంకులు జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే సభకు హాజరయ్యేందుకు ఆయన ఎంత మాత్రం ఇష్టపడడం లేదు. కేవలం ప్రెస్ మీట్ లు పెట్టి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని మాత్రమే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రసార మాధ్యమాల ద్వారానే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్యేలకు సూచించినట్లు అయింది. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు అనర్హత వేటు పై భయపడవద్దని.. గతంలో చంద్రబాబు సభకు హాజరు కాలేదని.. ఆయనపై అనర్హత వేటు పడిందా? అంటూ ప్రశ్నించారు. మొత్తానికి అయితే కండిషన్ పెట్టి వస్తానని చెప్పారు జగన్. కానీ ఆ కండిషన్కు అధికార పార్టీ ఒప్పుకోదని.. ఒప్పుకున్న తగిన సమయం ఇవ్వదని జగన్ తేల్చేయడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular