భారతదేశంలోని ప్రజలను గడిచిన ఆరు నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి విషయంలో ప్రజలకు ఉపశమనం కలిగించే వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అన్ లాక్ సడలింపుల తర్వాత దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు కాగా దేశంలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని అధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన్, ఔషధాలు అందుబాటులోకి రాకపోయినా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోందని వెల్లడిస్తున్నారు.
Also Read : అలెర్ట్: మరో 24 గంటలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక
అధికారులు దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించిన రోజు నుంచి ఆర్ విలువను లెక్కిస్తున్నారు. ఒక కరోనా రోగి నుంచి ఎంతమంది వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపే కొలమానాన్ని ఆర్ వాల్యూగా పేర్కొంటారు. ఈ విలువను బట్టే వైరస్ ఎలా వ్యాపిస్తుందనే విషయం గురించి అధికారులు ఒక అంచనాకు వస్తారు. ఆర్ విలువ ఎంత తగ్గితే వైరస్ అంత వేగంగా తగ్గుముఖం పడుతుందని అర్థం. గతంతో పోలిస్తే దేశవ్యాప్తంగా ఈ విలువ భారీగా తగ్గడం గమనార్హం.
మొదట కరోనా వైరస్ విజృంభించిన సమయంలో దేశంలో ఆర్ వాల్యూ 2 – 2.5గా ఉంది. గత వారం దేశంలో ఆర్ వాల్యూ 1.08గా ఉండగా ఈ వారం ఆ రేటు 0.83కు తగ్గుముఖం పట్టడం గమనార్హం. దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా రాష్ట్రాలన్నింటిలో ఆర్ వాల్యూ తగ్గుముఖం పడుతోందని ఫలితంగా మరికొన్ని రోజుల్లో వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం ఆర్ వాల్యూ క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉండటం గమనార్హం. దేశంలో కరోనా పరీక్షల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం కూడా ఆర్ వాల్యూ తగ్గుముఖం పట్టడానికి కారణమవుతోంది. ప్రజల్లో కరోనాపై అవగాహన పెరగడం, కొన్ని మందులు కరోనా రోగులపై మంచి ఫలితాలు ఇస్తుండటం వల్ల దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది.
Also Read : వేల మంది ప్రాణాలను కాపాడిన ఎలుక.. ఎలా అంటే..?