Annadata Sukhibhava 2nd phase: రైతులకు సాయం పై కేంద్ర ప్రభుత్వం ( central government) నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఏటా సాగు సాయం కింద కేంద్రం పీఎం కిసాన్ పేరిట 6000 రూపాయలు అందిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత గత 20 సార్లు పిఎం కిసాన్ నిధులు జమ చేశారు. 21వ విడత కింద నిధులు అందించేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. అదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద నిధులు జమ చేయాలి. ఇప్పటికే ఒకసారి కేంద్రంతో కలిపి నిధులు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే వచ్చే నెలలో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే రైతులకు ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రస్తుతం ఖరీఫ్ మధ్యలో ఉన్నారు రైతులు. సాగు పెట్టుబడుల కోసం ఖర్చులు చేశారు. పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ₹7,000 అందనుండడం ఉపశమనం కలిగించే విషయం.
కేంద్రం 20 విడతల్లో.
2014లో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi). 2019లో సైతం గెలిచారు. 2024లో మూడోసారి ప్రధాని అయ్యారు. అయితే ఆయన మొదట ప్రధాని అయిన తర్వాత పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏడాదికి ఒక్కో రైతుకు 6000 సాయం చేస్తూ వస్తున్నారు. ఎప్పటి వరకు 20 విడతల్లో రూ.40,000 ఒక్కో రైతుకు అందించారు. ఇప్పుడు 21వ సారి అందించేందుకు నిర్ణయించారు. అయితే దీపావళి కానుకగా ఈ నెల 18న రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ జమ చేస్తారని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ జరగలేదు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వరదల ప్రభావం ఉన్న మూడు రాష్ట్రాలకు మాత్రం పీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు. మిగతా రాష్ట్రాలకు సంబంధించి వచ్చే నెల విడుదల చేస్తారని తెలుస్తోంది.
రైతు భరోసా పేరిట..
గతంలో జగన్ ( Y S Jagan Mohan Reddy )హయాంలో రైతు భరోసా పేరిట ఒక్కో రైతుకు కేవలం రూ.7500 మాత్రమే అందేది. కేంద్ర ప్రభుత్వంతో కలిపి రూ.13,500 మాత్రమే ఇచ్చేవారు. అందుకే తాము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంతో కలిపి రూ.20000 అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈ ఏడాది ఆగస్టు రెండున కేంద్రం అందించే పీఎం కిసాన్ తో కలిపి రూ.7000 రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. ఇప్పుడు రెండో విడతగా కేంద్రం వచ్చే నెల 18న అందించనున్న పీఎం కిసాన్ 2000 రూపాయల మొత్తంతో కలిపి రూ.5000 అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రైతుల ఖాతాల్లో ఈ ఏడాదికి 14 వేల రూపాయలు జమ అయినట్టు. చివరిగా కేంద్రం అందించే 2000 రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 4వేల రూపాయలు జమ చేయనుంది. తద్వారా రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొనుంది కూటమి ప్రభుత్వం. అయితే చివరి నిమిషంలో మార్పులు తప్పిస్తే వచ్చేనెల 18న రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ జమ కావడం ఖాయం అని తెలుస్తోంది.