Andhra Pradesh New Districts: ఏపీలో( Andhra Pradesh) జిల్లాల పునర్విభజనకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు, ఉన్న జిల్లాల పేర్లు మార్పు, డివిజన్లు, మండలాలు ఇలా అన్ని అంశాలపై అధ్యయనం చేసేందుకు మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. నెల రోజుల్లో దీనిపై నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చిన సంగతి విది తమే. ఈ మంత్రుల సబ్ కమిటీలు అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదేండ్ల మనోహర్, సత్య కుమార్ ఉన్నారు. అయితే ఈ కమిటీ ఈరోజు అమరావతిలో సమావేశం అయింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Also Read: ప్రస్టేషన్ లో జగన్.. చంద్రబాబుపై సంచలన కామెంట్స్!
తొలి సమావేశం..
క్యాబినెట్ సబ్ కమిటీ( cabinet sub committee ) ఏర్పాటు అయిన తర్వాత తొలి సమావేశం ఇదే. జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై నిర్మించిన మంత్రుల బృందం పలు అంశాలపై చర్చించింది. జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోపు చేపట్టాల్సిన కసరత్తుపై కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈనెల 29, 30 తేదీల్లో ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో పర్యటించి ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని నిర్ణయించారు. ఈలోపు కూడా ప్రజలు తమ వినతులను జిల్లా కలెక్టర్ కు పంపించవచ్చని చెప్పారు. సెప్టెంబర్ రెండో తేదీ వరకు మాత్రమే ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించనున్నారు.
Also Read: ఏపీలో కొత్త జిల్లాలు.. నియోజకవర్గాల వారీగా.. జాబితా సిద్ధం!
అప్పట్లో అలా..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో 13 ఉమ్మడి జిల్లాలను.. 26 జిల్లాలుగా విభజించారు. అప్పట్లో జిల్లాల విభజన లో హేతుబద్ధత పాటించలేదన్న విమర్శ ఉంది. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా జిల్లాల విభజన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు వాటిని సరిచేసే పనిలో కూటమి ప్రభుత్వం పడింది. ఒకవైపు క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తుండగా.. ఏపీలో మరో ఆరు కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని.. మొత్తం 32 జిల్లాల ప్రకటన ఉంటుందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం నడుస్తోంది. అయితే ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం సచివాలయంలో జరిగింది. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన తర్వాత.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక నివేదిక తయారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇలా ఇచ్చిన నివేదిక ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే.. జిల్లాల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది.