Tesla AP
Tesla AP: ఎలాన్ మస్క్( Elon Musk ).. ప్రపంచ కుబేరుడు. ఆయనకు ఇవి కార్ల కంపెనీ టెస్లా ఉంది. ప్రపంచ దిగ్గజ సంస్థ కూడా. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎలాన్ మస్క్ సిద్ధమవుతున్న వేళ దేశంలో వివిధ రాష్ట్రాలు పోటీపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీ, ముంబైలో కొన్ని స్థలాలు చూపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ స్థలాలు అవుట్ లెట్ల కోసమేనంటూ టెస్లా ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు భారత మార్కెట్లో ప్రవేశానికి టెస్లా సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి నియామకాల ప్రక్రియ కూడా జరుగుతోంది. ఈ తరుణంలో ఆ కంపెనీని ఏపీకి రప్పించేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ఓసారి టెస్లా ప్రతినిధులతో చర్చించారు. ఇప్పుడు మరోసారి ఏపీ ప్రభుత్వం టెస్లా కంపెనీకి లేఖ రాయడం విశేషం. అలాగే సంస్థను ఏపీకి రప్పించేందుకు భారీగా ఆఫర్లు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థగా టెస్లాకు మంచి పేరు ఉంది.
* దేశీయంగా ప్లాంట్ ఏర్పాటు
భారతదేశంలో టెస్లా( Tesla) తయారు చేసే కార్లకు డిమాండ్ ఉంది. అయితే దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ కార్ల ధర ఎక్కువగా ఉంటోంది. అది అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. అందుకే ఇండియాలో పరిశ్రమ ఏర్పాటు చేసి ఇక్కడే ఉత్పత్తి పెంచుకోవాలని టెస్లా భావిస్తోంది. తద్వారా ఇండియా మార్కెట్లో పుంజుకోవచ్చని ఒక అంచనాకు వచ్చింది. దీంతో దేశీయంగా ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలిస్తోంది. ఈ కంపెనీ ఏర్పాటు అయితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో సైతం ఏపీ ప్రత్యేకంగా గుర్తింపు పొందే ఛాన్స్ ఉంటుంది. అందుకే చంద్రబాబు పావులు కదిపినట్లు సమాచారం. అయితే ఈ ప్రయత్నం వర్కౌట్ అయితే మాత్రం ఏపీ పంట పండినట్టే.
* ఆ రెండు రాష్ట్రాల ప్రయత్నం
మరోవైపు మహారాష్ట్ర( Maharashtra) తో పాటు గుజరాత్ సైతం ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి. అన్ని వనరులు సమకూరుస్తామని ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తున్నట్లు పారిశ్రామిక వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ రెండు రాష్ట్రాలను వెనక్కి నెట్టేస్తూ ఏపీ ఈ రేసులోకి ముందుకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. టెస్లా యాజమాన్యాన్ని ఆకర్షించేలా ఏపీ ప్రభుత్వం భారీ రాయితీల ప్రకటనకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అవసరం అనుకుంటే టెస్లా కంపెనీ కోసం ఒక కోర్టు అప్పగిస్తామని ప్రతిపాదించినట్లు సమాచారం. దీనికి టెస్లా యాజమాన్యం మెత్తబడినట్లు ప్రచారం జరుగుతోంది.
* అప్పట్లో నారా లోకేష్
గత అక్టోబర్లో అమెరికా పర్యటనకు వెళ్లారు మంత్రి నారా లోకేష్( Nara Lokesh). అప్పట్లో పెద్ద ఎత్తున దిగ్గజ పారిశ్రామికవేత్తలను కలిశారు. అందులో భాగంగా టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజా తో సమావేశం అయ్యారు. మరోవైపు తాజాగా ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. టెస్లాను ఏపీకి రప్పించేందుకు రాష్ట్ర ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అవసరమైన స్థలాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది. రాష్ట్రానికి పోర్టులు ఉండడంతో.. తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునేందుకు.. ముడి సరుకును దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వ ఆఫర్లతో గుజరాత్ తో పాటు మహారాష్ట్ర వెనక్కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరి ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.