https://oktelugu.com/

America: నగ్నంగా పరిగెత్తితే చదువులో రాణిస్తారట.. ఇదొక వింత ఆచారం

కొందరు అలా చేస్తే లైఫ్‌లో మంచి జరుగుతుందని, ఇలా చేస్తే మంచి జరుగుతుందని భావించి ఎన్నో పనులు చేస్తుంటారు. చేసిన తర్వాత మంచి జరుగుతుందా? లేదా? అనే విషయం సరిగ్గా తెలియదు. కానీ ఆచారం అని పాటిస్తుంటారు. అయితే అమెరికాలోని ఓ కాలేజీలో వింత ఆచారం ఉంది. ఈ వింత ఆచారం ఏంటో తెలిస్తే ప్రతీ ఒక్కరూ కూడా షాక్ అవుతారు. ఇంతకీ ఆ ఆచారం ఏంటో తెలియాలంటే ఆలస్యం చేయకుండా స్టోరీపై ఓ లుక్కేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 12, 2024 / 12:18 AM IST

    America

    Follow us on

    America: ఈ ప్రపంచంలో ఎన్నో వింత ఆచారాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వింత ఆచారాలు ఉన్నాయి. కేవలం ఇండియాలోనే ఎక్కువగా వింత ఆచారాలు ఉన్నాయని అనుకుంటారు. కానీ ఇండియాతో పోలిస్తో మిగతా దేశాల్లో ఎక్కడలేని వింత ఆచారాలు ఉన్నాయి. వీటిని వింటే మరి ఇంత దారుణంగా ఉన్నారేంటని అనిపిస్తుంది. ఇంత టెక్నాలజీలో కూడా మూఢనమ్మకాలను పాటిస్తున్నారంటే మీరే అర్థం చేసుకోవాలి. సాధారణంగా మనం రోజూ ఇలాంటి విషయాలు గురించి వింటూనే ఉంటాం. కొందరు అలా చేస్తే లైఫ్‌లో మంచి జరుగుతుందని, ఇలా చేస్తే మంచి జరుగుతుందని భావించి ఎన్నో పనులు చేస్తుంటారు. చేసిన తర్వాత మంచి జరుగుతుందా? లేదా? అనే విషయం సరిగ్గా తెలియదు. కానీ ఆచారం అని పాటిస్తుంటారు. అయితే అమెరికాలోని ఓ కాలేజీలో వింత ఆచారం ఉంది. ఈ వింత ఆచారం ఏంటో తెలిస్తే ప్రతీ ఒక్కరూ కూడా షాక్ అవుతారు. ఇంతకీ ఆ ఆచారం ఏంటో తెలియాలంటే ఆలస్యం చేయకుండా స్టోరీపై ఓ లుక్కేయండి.

    ఏ పని చేసిన కూడా కష్టపడితే ఫలితం వస్తుంది. విద్యార్థులు చదువులో మంచిగా రాణించాలంటే కష్టపడి చదవాలి. అప్పుడే వారు ఉన్నతంగా ఎదుగుతారు. కానీ అమెరికాలో మసాచుసెట్స్‌లోని విలియమ్స్ కాలేజీలో విద్యార్థులు బాగా చదవాలంటే ఓ పని చేయాలట. ఇది ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం అంటా. అమెరికా ప్రాంతీయ కార్యాలయానికి బట్టలు లేకుండా నగ్నంగా విద్యార్థులు పరిగెత్తడం వల్ల వారు చదువులో రాణిస్తారనే ఓ సంప్రదాయం ఉంది. ఇక్కడ విద్యార్థులు దీన్ని 1940 నుంచి పాటిస్తున్నారు. అయితే ఫస్ట్ ఇయర్‌లో ఎవరు అయితే జాయిన్ అవుతారో వారు తమ హాస్టల్ నుంచి కాలేజీ ప్రెసిడెంట్ రీజనల్ ఆఫీస్ వరకు బట్టలు లేకుండా పరుగెత్తితే.. చదువుకునేందుకు శక్తి లభిస్తుందట. ఇది కాలేజీ ఆచారం అంటా. జాయిన్ అయిన ప్రతీ ఒక్కరూ కూడా ఈ ఆచారాన్ని తప్పకుండా పాటించాలి.

    ఇదే కాకుండా ఇక్కడ ఉండే వెల్లెస్లీ కాలేజీలో ఇంకో ఆచారం కూడా ఉంది. సాధారణంగా ఎవరైనా పెళ్లి, నిశ్చితార్థం వంటివి శుభకార్యాలు జరగాలంటే దేవుని పూజించడం లేదా ఏవైనా శాంతి జరిపించడం వంటివి చేస్తుంటారు. కానీ వెల్లెస్లీ కాలేజీలో మాత్రం రాయిని ముద్దు పెట్టుకోవాలట. ఈ కాలేజీ చదువుతున్న విద్యార్థులు క్యాంపస్‌లో ఉండే ఓ పెద్ద బండ రాయిని ముద్దు పెట్టుకోవడం వల్ల అమ్మాయిలకు నిశ్చితార్థం జరుగుతుందనే ఆచారం కూడా ఉందట. ఎన్నో శతాబ్దాల నుంచి ఇక్కడ ఈ ఆచారం ఉందట. ఎవరైతే బండ రాయిని ముద్దు పెట్టుకుంటారో వారికి ఏడాది లోపే వివాహం జరుగుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. మరి ఈ సంప్రదాయంపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి వింత ఆచారాలు మీకు ఏవైనా తెలుసా? మీరు చూశారా? మీకు తెలిసిన కొన్ని వింత ఆచారాల గురించి కామెంట్ చేయండి.