Homeఆంధ్రప్రదేశ్‌Ambati Rambabu Arrested: అంబటి రాంబాబు అరెస్ట్..సత్తెనపల్లిలో హైటెన్షన్..కారు ధ్వంసం, సంచలనం రేపుతున్న వీడియో!

Ambati Rambabu Arrested: అంబటి రాంబాబు అరెస్ట్..సత్తెనపల్లిలో హైటెన్షన్..కారు ధ్వంసం, సంచలనం రేపుతున్న వీడియో!

Ambati Rambabu Arrested: తిరుమల లడ్డు వ్యవహారం లో వైసీపీ పార్టీ సోషల్ మీడియా గత కొద్దిరోజులుగా చేస్తున్న దుష్ప్రచారాలపై మండిపడ్డ కూటమి అభిమానులు, కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ నెయ్యి గురించి ప్రచారం చేస్తూ, పెద్ద పెద్ద బ్యానర్లు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ఈ బ్యానర్స్ కారణంగా ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. నిన్న సత్తెనపల్లి లో ఈ బ్యానర్స్ ని చింపడానికి తన కార్యకర్తలతో కలిసి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు(Ambati Rambabu) ని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం, దీంతో ఆవేశంతో రెచ్చిపోయిన అంబటి రాంబాబు ‘ల’ కారాలతో వాళ్ళని దూషించడమే కాకుండా, సాక్ష్యాత్తు చంద్రబాబు నాయుడు ని కూడా బూతులు తిట్టడం వంటి సంఘటనలు పెను దుమారం రేపాయి. దీంతో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అంబటి రాంబాబు ఇంటికి చేరుకొని అతనిపై దాడి చేసే ప్రయత్నం చేశారు.

ఆయన కారుని ద్వంసం చేశారు, ఆఫీస్ లోకి చొరబడి చితక్కొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే అంబటి రాంబాబు అనుచరులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకొని టీడీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ శక్తి సరిపోలేదు. పోలీసులు కూడా కార్యకర్తల ఆగ్రహాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. పరిస్థితులు చెయ్యి దాటిపోయాయి. మరోపక్క సీఎం ని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడినందుకు సోషల్ మీడియా ద్వారా రాజకీయ ప్రముఖులు రెస్పాన్స్ ఇచ్చారు. జనసేన పార్టీ కూడా తీవ్ర స్థాయిలో ఖండించింది. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రేంజ్ లో వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు పై సుమోటాగా పోలీసులు కేసు నమోదు చేసి నిన్న రాత్రి ఆయన్ని అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఆయన ఇంటి చుట్టూ అప్పటికి కూడా ఉద్రికత్త పరిస్థితులే ఉన్నాయి.

పోలీసులు ఆయనకు రక్షణా కవచం లాగా ఏర్పడి జీప్ లోకి ఎక్కించుకొని తీసుకెళ్లారు. వాళ్ళు అడ్డు లేకపోతే అంబటి రాంబాబు పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకోవడానికి కూడా కష్టమే. పోలీసులు అంబటిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వీడియో ని మీరు క్రింద చూడొచ్చు. ఇకపోతే అంబటి పై దాడిని ఖండిస్తూ మాజీ సీఎం జగన్ కూడా స్పందించాడు. తప్పు ని అడ్డుకుంటే దాడి చేస్తారా?, ఇదెక్కడి న్యాయం అంటూ ఆవేదన వ్యాక్యం చేసాడు. రాబోయే రోజుల్లో ఆయన ఆయన అంబటి రాంబాబు ని జైలుకు వెళ్లి కలిసే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version