Homeఆంధ్రప్రదేశ్‌Nominated posts : ఏపీలో దాదాపుగా ఖరారైన నామినేటెడ్ పదవులు.. దక్కించుకున్నది వీరే!

Nominated posts : ఏపీలో దాదాపుగా ఖరారైన నామినేటెడ్ పదవులు.. దక్కించుకున్నది వీరే!

Nominated posts : ఏపీలో నామినేటెడ్ సందడి ప్రారంభమైంది. పదవుల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తయింది.ఎన్నికల్లో వివిధ కారణాలతో టిక్కెట్లు దక్కని వారికి చంద్రబాబు పెద్దపీట వేశారు.అదే సమయంలో జనసేన తో పాటు బిజెపి కీలక నేతలకు సైతం పదవులు ఇవ్వనున్నారు. మూడు పార్టీల మధ్య సమన్వయంతో పదవుల పంపకాలు చేపట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటుతోంది. పాలన సైతం గాడిన పడుతోంది. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రాధాన్యతాంశాలుగా తీసుకున్నారు. అదే సమయంలో ఏపీకి పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తిచేయాలని భావిస్తున్నారు. తద్వారా ఎక్కడా అసంతృప్తి లేకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. నామినేటెడ్ పదవుల ఎంపికపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ తో చంద్రబాబు చర్చించారు. ఆయన సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో నామినేటెడ్ పదవులకు సంబంధించి జాబితాలను ప్రకటించే అవకాశం ఉంది.వాస్తవానికి ఈనెల16న నామినేటెడ్ పదవులను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది.అయితే కనీసం 30% పదవులను భర్తీ చేయాలని చూశారు.మూడు పార్టీల్లో కీలక నాయకుల పేర్లను పరిగణలోకి తీసుకున్నారు. ఎట్టకేలకు ఈ జాబితా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే పేర్లు ప్రకటించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.

* టీటీడీ సైతం ఖరారు
ముఖ్యంగా టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకం దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. చైర్మన్ గా టీవీ5 అధినేత బిఆర్ నాయుడు పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ట్రస్ట్ బోర్డు సభ్యులుగాతెలంగాణ వారి పేర్లు కూడా పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.

* ఏపీఐఐసీ చైర్మన్గా బొడ్డు వెంకటరమణ చౌదరి నియామకం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
* ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరును ఖరారు చేశారు. ఎన్నికల్లో ఆయన టిక్కెట్ త్యాగం చేశారు. త్యాగానికి ఫలితంగా కీలకమైన ఆర్టీసీ చైర్మన్ పదవి కేటాయించినట్లు తెలుస్తోంది.
* ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నాదెండ్ల బ్రాహ్మణ చౌదరి నియామకం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
* ఫుడ్ కమిషన్ చైర్మన్ గా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి పేరు ఖరారు చేశారు. ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించారు. కానీ దక్కలేదు.
* శాప్ చైర్మన్ గా పొలం రెడ్డి దినేష్ రెడ్డి పేరు ఖరారు చేశారు.
* మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా రెడ్డి వాణి నియమితులయ్యే అవకాశం ఉంది.
* ఏపీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నీలయపాలెం విజయ్ కుమార్ ఎంపికైనట్లు తెలుస్తోంది.
* ఏపీ మారి టైం బోర్డు చైర్మన్ గా గొంప కృష్ణ పేరు ఖరారు అయినట్లు సమాచారం.
* ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా సోము వీర్రాజు ఎంపిక దాదాపు ఖాయమే.
* ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్ గా షేక్ రియాజ్.
* ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బొబ్బూరి వెంగళరావు.
* ఏపీ గ్రేనేట్బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బండ్రెడ్డి రామకృష్ణ.
* ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ గా విష్ణువర్ధన్ రెడ్డి.
* ఏపీ స్వచ్ఛంద మిషన్ చైర్మన్ గా పాతూరు నాగభూషణం.
* ఏపీ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నిమ్మల కృష్ణప్ప.
* ఏపీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ గా అనిమిని రవి నాయుడు.
* ఎస్సీ కమిషన్ చైర్ పర్సన్ గా మాజీమంత్రి పీకల సుజాత.
* ఎస్టి కమిషన్ చైర్మన్ గా కిడారి శ్రావణ్ కుమార్.
* ఏపీ ఎస్ఎంఐడిసి చైర్ పర్సన్ గా రాయపాటి అరుణ.
* తుడా చైర్మన్ గా దివాకర్ రెడ్డి.
* నెడ్ క్యాప్ చైర్మన్ గా ఉక్కు ప్రవీణ్ రెడ్డి.
* ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నటుడు పృథ్విరాజ్.
* అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీమంత్రి ఆలపాటి రాజా నియమితులైనట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular