Allu Arjun: నేటి తరం హీరోయిన్స్ లో అందం తో పాటు అద్భుతమైన నటన కనబర్చగల అతి తక్కువ మందిలో ఒకరు కృతి సనన్. ఈమె అద్భుతమైన నటనకు గానూ నేషనల్ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. మన టాలీవుడ్ ‘1 నేనొక్కడినే’ చిత్రం ద్వారా ఈమె వెండితెర అరంగేట్రం చేసింది , ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్య తో ‘దోచేయ్’ అనే చిత్రం చేసింది. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అవ్వడం తో , టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు ఆమె ఇమేజ్ స్టార్ హీరోలతో సమానం. కేవలం కృతి సనన్ కోసమే థియేటర్స్ కి కదిలే ఆడియెన్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది, ఆ స్థాయికి చేరుకుంది.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె ‘కాక్టెయిల్ 2 ‘ అనే చిత్రం లో నటించింది. షాహిద్ కపూర్ హీరో గా నటించిన ఈ సినిమాలో రష్మిక మరో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా వచ్చే నెల 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుండడంతో , మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను ఇప్పటి నుండే మొదలు పెట్టారు. రీసెంట్ గానే ఒక సాంగ్ లాంచ్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ ఈవెంట్ లో కృతి సనన్ అల్లు అర్జున్ గురించి చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులుగా ఆమె సమాధానం చెప్తూ ‘ఒక నటుడిగా అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది . కచ్చితంగా ఇండియా లోనే గొప్ప నటులలో ఒకరు అల్లు అర్జున్’.
‘ఆయనతో కలిసి ఒక్క సినిమా చెయ్యాలని నాకు ఎప్పటి నుండో ఒక కోరిక ఉంది. మిత్రులారా మీరంతా సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టి , ఈ విషయాన్నీ అల్లు అర్జున్ కి చేరేలా చేయండి , ఇలా అయినా మా కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందో లేదో చూద్దాం’ అంటూ చెప్పుకొచ్చింది కృతి సనన్. బాలీవుడ్ లో అంత పెద్ద స్టార్ హీరోయిన్ , నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది , ఇండియా లో ఇంతమంది సూపర్ స్టార్స్ ఉన్నప్పటికీ కూడా , ఆమె అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాలనే కోరిక ని బయటపెట్టిందంటే , అల్లు అర్జున్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్.
