Acadamic Calender : ఏపీలో విద్యా సంవత్సరం ప్రారంభమై 45 రోజులు అవుతోంది. జూన్ 12న విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మీకు క్యాలెండర్ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో పని దినాలు, సెలవులు, పాఠశాలల టైమింగ్స్, పరీక్షలు తదితర వివరాలను వెల్లడించింది. ఈ క్యాలెండర్ ప్రకారం విద్యా సంవత్సరంలో పాఠశాలలు పనిచేయాల్సి ఉంటుంది. ఆకస్మికంగా ప్రకటించే సెలవులు ఇందుకు అదనం. అయితే ఇలా ప్రకటించిన సెలవులకు సంబంధించి… సెలవు దినాల్లో పాఠశాల నిర్వహించాల్సి ఉంటుంది.
విద్యా సంవత్సరం ప్రారంభం రోజుల్లోనే అక్కడ మీకు క్యాలెండర్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మాత్రం ఆలస్యం అయ్యింది. ప్రభుత్వం విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 315 రోజులు ఉన్నాయి. ఇందులో 233 పని దినాలు,82 సెలవులు ఉన్నాయి. ఇక పాఠశాలల నిర్వహణకు సంబంధించి.. ప్రాథమిక పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం మూడున్నర గంటల వరకు పనిచేస్తాయి.ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేస్తాయి.దసరా సెలవులు అక్టోబర్ 4 నుంచి 13 వరకు ప్రకటించారు. క్రైస్తవ మైనారిటీ పాఠశాలలకు మాత్రం దసరా సెలవులు అక్టోబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజులు పాటు మాత్రమే ఉంటాయి.ఇక క్రైస్తవ మైనారిటీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 20 నుంచి 29 వరకు ఇస్తారు. మిగతా అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు ఇస్తారు.
పరీక్షలకు సంబంధించి అకడమిక్ క్యాలెండర్లో షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అన్ని తరగతులకు ఫార్మాటివ్-1 పరీక్షలు ఆగస్టు 1 నుంచి 5 వరకు నిర్వహిస్తారు. ఫార్మాటివ్ 2 పరీక్షలు సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు నిర్వహిస్తారు. సమ్మేటివ్ 1 పరీక్షలు మాత్రం నవంబర్ 1 నుంచి 15 వరకు, ఫార్మాటివ్ 3 పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 6 వరకు నిర్వహిస్తారు. పదో తరగతి విద్యార్థులకు సంబంధించి ఫ్రీ ఫైనల్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. ఫార్మాటివ్ 4 పరీక్షలు మార్చి 3 నుంచి 6 వరకూ, సమ్మేటివ్ 2 పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి 18 వరకు నిర్వహిస్తారు.
ఇప్పటికే పాఠశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. పాఠ్య పుస్తకాల పంపిణీ సైతం పూర్తయింది. అయితే అకడమిక్ క్యాలెండర్ జాప్యానికి ప్రభుత్వం కొలువు దీరకపోవడమే కారణం. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెల 12న సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత బాధ్యతలు స్వీకరించారు.అందుకే అకడమిక్ క్యాలెండర్ రూపకల్పనలో కొద్దిపాటి జాప్యం జరిగింది. ప్రభుత్వ విద్య పై దృష్టి సారించిన ప్రభుత్వం.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకలపై ఫోకస్ పెట్టింది.నాడు నేడు పథకంలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.విచారణకు ఆదేశించింది.పాఠశాలల విలీనం,ఉపాధ్యాయుల సర్దుబాటు వంటి వాటిపై కూడా దృష్టి పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.గత ప్రభుత్వంలో నిర్ణయాలను పున సమీక్షించే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా లోపాలు ఉంటే కఠిన చర్యలకు ఉపక్రమించే పరిస్థితి కనిపిస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Academic calendar of schools released by government of andhra pradesh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com