BJP master plan: ఎన్డీఏ లో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయ్యేందుకు అవసరమైన ఎంపీల బలాన్ని అందించగలిగింది. అందుకే కేంద్ర పెద్దలు తెలుగుదేశం పార్టీని బలమైన నమ్మదగిన మిత్రుడిగా భావిస్తున్నారు. అందుకే ఏపీ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. రాజకీయంగాను పరస్పర సహకారం అందుతోంది ఏపీకి. మరోవైపు సీఎం చంద్రబాబుకు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు బిజెపి పెద్దలు. అయితే తాజాగా చంద్రబాబుకు కీలక బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారానికి ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు సమాచారం. రెండు నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారం చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు..
మే నెలలో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాములలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే ఈ ఐదు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్, అస్సాం కీలకం. ప్రస్తుతం అస్సాంలో బిజెపి అధికారంలో ఉంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించి అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్లో గెలవడం అంత ఈజీ కాదు. అందుకే అక్కడ సర్వశక్తులను వడ్డాలని భావిస్తోంది బిజెపి.
Also Read: జగన్ కు అజ్ఞాత అధికారి లేఖ.. సారాంశం అదే!
మమతాకు చెక్ చెప్పాలని..
మమతా బెనర్జీ వరుసగా రెండుసార్లు బెంగాల్లో అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు మమతా బెనర్జీ. వామపక్షాలను కూకటి వేళ్లతో పెకిలించి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే దేశంలో వరుసగా మూడుసార్లు అధికారం చేపట్టిన బిజెపి బెంగాల్లో జెండా పాతాలని చూస్తోంది. కానీ మమతా బెనర్జీ బలం ముందు, వ్యూహాల ముందు నిలబడలేక పోతోంది. అయితే ఈసారి మాత్రం ఎలాగైనా విజయం సాధించేందుకు చాలా రకాల వ్యూహాలు పన్నుతోంది. ఏ చిన్న అవకాశం వచ్చిన జారవిడుచుకునేందుకు ఇష్టపడడం లేదు.
ప్రత్యేక ఆహ్వానం..
చంద్రబాబును ప్రచారంలోకి తెచ్చి మమతా బెనర్జీని దెబ్బతీయాలన్నది కేంద్ర పెద్దల వ్యూహంగా తెలుస్తోంది. గతంలో చంద్రబాబుకు రాజకీయంగా అత్యంత సన్నిహితురాలిగా ఉండేవారు మమతా బెనర్జీ. గతంలో చంద్రబాబు ఆమెకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపికి మమతా బెనర్జీ వ్యతిరేకమయ్యారు. చంద్రబాబు దగ్గరయ్యారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో చంద్రబాబుతో ప్రచారం చేయిస్తే వర్కౌట్ అవుతుందని బిజెపి ఆలోచన. మరోవైపు బెంగాల్లో తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. వారు చంద్రబాబు నాయకత్వంపై సానుకూలంగా ఉంటారు. అందుకే చంద్రబాబును ప్రచారం చేయించడం ద్వారా బిజెపి వీలైనంత ఎక్కువ సీట్లు పొందేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబుకు ఆహ్వానం అందిందని.. ఆయన ఓ మూడు రోజులపాటు పశ్చిమ బెంగాల్లో ప్రచారం చేయడం ఖాయమని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో?
