Big twist in Railway Koduru MLA case: గత రెండు రోజుల నుండి రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, హంస వీణ అనే ప్రభుత్వ ఉద్యోగి తో అక్రమ సంబంధం పెట్టుకొని, ఆమెతో చేసిన వికృత క్రీడలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో లీకై ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూసాము. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. కొందరు వీణ ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే ని హానీ ట్రాప్ చేసి ఇరికించిందని అంటున్నారు. మరికొంత మంది అయితే వీణ కి అన్యాయం జరిగింది, ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై స్వయంగా మాజీ సీఎం జగన్ కూడా మాట్లడడంతో ఈ వ్యవహారం తారా స్థాయికి చేరుకుంది. అయితే జనసేన పార్టీ ఈ వ్యవహారం కమిటీ ని వేసి నిజానిజాలు తేల్చాలని, అప్పటి వరకు ఆరవ శ్రీధర్ జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదంతా పక్కన పెడితే మొన్న వీణ ప్రెస్ మీట్ లో పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తనకు ఆరవ శ్రీధర్ కారణంగా 5 సార్లు అబార్షన్ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఏ హాస్పిటల్ లో అయ్యిందో కూడా చెప్పింది. అయితే నేడు పోలీసులు ఆమె చెప్పిన సంజీవని హాస్పిటల్ కి వెళ్లి విచారించారు. అక్కడి డాక్టర్లు వీణ కి మేము ఎలాంటి అబార్షన్ చేయలేదని ఆధారాలతో సహా చూపించారు. దీంతో షాక్ కి గురైన పోలీసులు, ఫేక్ ఆరోపణలు చేసినందుకు గాను ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు ని నమోదు చేశారు. అంతే కాకుండా ఒక జర్నలిస్ట్ ని ఇంటికి పిలిచి, అతన్ని బెల్ట్ తీసుకొని చితకబాదుతూ హింసించినందుకు కూడా మరో నాన్ బెయిలబుల్ కేసు ని నమోదు చేశారు. అలా మొత్తం మీద ఆమెపై 4 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు.
దీంతో వీణ పరారీ అయ్యింది. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా ఆమె ఫోన్ లో అందుబాటులోకి రావడం లేదు. పోలీసులు లొకేషన్ ని ట్రేస్ చేయడానికి చూస్తున్నారు . ఎట్టి పరిస్థితిలోనూ ఆమెని పట్టుకొని నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తామని అంటున్నారు పోలీసులు. ఈమెపై కేసు నమోదు చేశారు, అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ కూడా తప్పు చేసాడు కదా , ఆయన పైన కూడా కేసులు నమోదు చేయాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
‼️ BREAKING NEWS
Railway Koduru Harsha Veena is ABSCONDING.
Police has filed 4 Non-Bailable cases including the atrocity on journalist along with the fake abortion claims at Sanjeevani hospital. The hospital yesterday has ruled out the claims in a press meet.
She is… pic.twitter.com/cFKkGdYZWb
— Rathnam News (@RathnamNews) January 30, 2026