https://oktelugu.com/

AP Liquor Shops: ఏపీలో మరో 340 మద్యం దుకాణాలు.. కొత్త మార్జిన్ ఖరారు

రాష్ట్రంలో కొత్తగా 340 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల మార్జిన్ కు సంబంధించి కూడా పెంచాలని నిర్ణయించింది.

Written By:
  • Dharma
  • , Updated On : January 1, 2025 / 12:05 PM IST

    AP Liquor Shops

    Follow us on

    AP Liquor Shops: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారులకు సంబంధించి మార్జిన్ శాతాన్ని పెంచింది. ప్రస్తుతం ఇస్తున్న 10.5% మార్జిన్ ను 14 శాతానికి పెంచేందుకు అనుమతించారు. అలాగే కల్లు గీత కులాలకు 340 షాపులను కేటాయించారు. వారంలోగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మద్యం బ్రాండ్లతో పాటు ధరలపైన సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3,336 మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అందులో గతంలో ఇచ్చిన హామీ మేరకు 10 శాతం మద్యం షాపులను గీత కులాలకు తాజాగా కేటాయించారు. మరో వారం రోజుల్లో 340 షాపులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ కానుంది.

    * కల్లుగీత కార్మికుల కోసం
    కల్లుగీత కార్మికులుగా చాలా వర్గాలు ఉన్నాయి. మద్యం వ్యాపారానికి సంబంధించి చాలా సామాజిక వర్గాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమకు కులవృత్తిగా భావించి మద్యం షాపులను కేటాయించాలని వారు కోరారు. దీంతో 10 శాతం షాపులను వారికి కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారు. ప్రధానంగా గౌడ, యాత, సొండి, శెట్టిబలిజ, ఈడిగ, గామల్ల, కలాలి, శ్రీశయన, సెగిడి, గౌండ్ల కులాలకు వీటిని కేటాయిస్తారు. ఒకరికి ఒక షాపు మాత్రమే కేటాయింపు ఉంటుంది. 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ షాపుల కాలపరిమితి. వీరికి 50 శాతం లైసెన్స్ ఫీజు తోనే షాపులు కేటాయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా షాపుల ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

    * తక్కువ ధర బ్రాండ్ కొనసాగించాల్సిందే
    ఎక్సైజ్ అధికారులతో చంద్రబాబు సమీక్ష జరిపారు. 99 రూపాయల మద్యంపై ఎక్కువగా చర్చ నడిచింది. మద్యం ప్రభావం మిగతా బ్రాండ్లపై పడుతోందని.. ప్రస్తుతం జరుగుతున్న అమ్మకాల్లో 21% 99 రూపాయల బ్రాండ్ల మద్యం దేనిని అధికారులు చెప్పుకొచ్చారు. ప్రీమియం బ్రాండ్లను అమ్ముతున్నా.. విక్రయాలు తక్కువగా ఉన్నాయని అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో తక్కువ ధర మద్యం విక్రయాలు తగ్గించవద్దని.. ఎన్నికల హామీ మేరకు కొనసాగించాల్సిందేనని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. అయితే గతంలో ఇచ్చిన మార్జిన్ కంటే నాలుగు శాతం పెంచడం వ్యాపారులకు ఆనందం ఇచ్చే విషయం.