Congress: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు దాటింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలను ప్రజలకు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వీటిని అమలు చేస్తామని ప్రకటించింది. టిఆర్ఎస్ పాలనపై వ్యతిరేకత, ఆకర్షణీయమైన ఆర్ గ్యారంటీలు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చాయి. దీంతో హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఎన్ని గ్యారంటీలు అమలు..
కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరిన 48 గంటల్లోనే ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచారు. ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. తాజాగా 500 కు గ్యాస్ సిలిండర్ అమలు చేస్తున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు. ఇటీవలే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్.
అమలు కానివి..
ఇక తెలంగాణలో అమలు కాని గ్యారెంటీ హామీలు పరిశీలిస్తే.. రైతుల రుణమాఫీ పూర్తి కాలేదు. మహిళలకు 2500 ఆర్థిక సాయం అందడం లేదు. సామాజిక పింఛన్ల పెంపు జరగలేదు. విద్యార్థులకు స్కూటీలు విద్యార్థులకు రుణ కార్డులు ఇవ్వలేదు. ఇవి కాకుండా ఇంకా అనేక హామీలు పెండింగ్ లోనే ఉన్నాయి.
వ్యతిరేకత రాకుండా..
ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రభుత్వం వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతోంది. ప్రజాకర్షకమైన ఆర్టీసీ ఉచిత ప్రయాణం 500 కేజీ సిలిండర్ 2 యూనిట్లు ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తోంది. దీంతో ప్రజల్లో పెద్దగా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించడం లేదు.
ప్రజా పాలన అంటూ..
మరోవైపు రేవంత్ సర్కార్ తమది ప్రజల పాలన అని ప్రకటించుకుంటుంది. అందులో భాగంగానే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చామని సెక్రటేరియట్లోకి సామాన్యులను అనుమతిస్తున్నామని ప్రజలకు అవసరమైన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెబుతోంది. 30 వేల ఉద్యోగాలు 100 రోజుల్లో భర్తీ చేశామని పేర్కొంటుంది. వచ్చే వానాకాలం నుంచి రైతులకు పెట్టుబడి సాయం 15000 అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. పంట రుణాల మాఫీకి కూడా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడిచ్చింది.
మొత్తంగా రేవంత్ సర్కార్ చేస్తున్న పనులకు తెలంగాణలో ఇప్పటివరకు మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. వీటి ప్రభావం వచ్చే లోకసభ ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాలి