Vijay Birthday: నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన పుట్టినరోజు జరుపుకున్నారు. టీవీకే నేతలు ఆయన జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు ఆయన జన్మదినాన్ని గొప్పగా నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ విజయ్ కి ఆయన నెచ్చలి త్రిష నుంచి ఎటువంటి బర్త్ డే విషెస్ రాలేదు. కనీసం ఆమె సోషల్ మీడియాలో కూడా ఎటువంటి పోస్ట్ చేయలేదు. దీనికి తోడు విజయ్ ని ఇన్ స్టా గ్రామ్ లో ఆమె అన్ ఫాలో చేసింది.
ఇటీవలి విజయ్ భార్య సంగీతతో కలిసి పోతున్నారని.. త్రిశతో దూరం జరుగుతున్నారని వార్తలు రావడం మొదలైంది. దీనిని సంగీత కూడా ఖండించలేదు. వీటికి బలం చేకూర్చే విధంగా త్రిష సోషల్ మీడియాలో విజయ్ ని అన్ ఫాలో చేసింది. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు ఆయన పుట్టిన రోజు నాడు కనీసం త్రిష గ్రీటింగ్స్ కూడా చెప్పలేదు. దీంతో వీరిద్దరూ విడిపోయారని అందరూ ఒక అంచనాకొచ్చారు. ఇక మీడియాలో అయితే వార్తలు బీభత్సంగా పబ్లిష్ అయ్యాయి.
వీటన్నింటికీ త్రిష తెరదించారు. అంతేకాదు తన ఇన్స్టా గ్రామ్ లో ఒకే ఒక ఫోటో పోస్ట్ చేసి అందరి అంచనాలను తలకిందులు చేశారు. విజయ్ ముందు దాదాపు 5 ప్రత్యేకమైన కేకులను త్రిష ఏర్పాటు చేశారు. విజయ్ కూడా యువకుడి మాదిరిగా ప్రింటెడ్ షర్ట్ వేసుకున్నారు. ఆ కేకులను చూస్తూ మురిసిపోయారు.. అతడు మురిసిపోతుంటే త్రిష చిరునవ్వు చిందించారు. ఈ ఫోటోను త్రిష తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. విజయ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి లవ్ సింబల్ కూడా జోడించారు. అంతేకాదు 00.00 నెంబర్ యాడ్ చేశారు. అసలు ఈ నెంబర్ కు అర్థం ఏంటో తెలియక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.
విజయ్ ముఖ్యమంత్రి తర్వాత త్రిష ఇటీవల అతనితో కలిసి కనిపించారు. అజిత్ మాతృమూర్తి చనిపోవడంతో.. పరామర్శించడానికి విజయ్ తో కలిసి ఆమె వచ్చారు.. అంతకుముందు విజయ్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అతని అభినందించడానికి నేరుగా వెళ్లారు. అతని ఇంటి వద్ద చాలాసేపు గడిపారు. ఆ తర్వాత విజయ్ కి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో త్రిష కనిపించారు. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వెనుక త్రిష కృషి కూడా ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరోవైపు ప్రభుత్వంలో త్రిష కీలకపాత్ర పోషిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆమె టీవీకే కార్యకలాపాలకు.. ఇతర వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు. తన సినిమా షూటింగ్లలో ఆమె పాల్గొంటున్నారు.
