Tesla car viral video: టెస్లా.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మానస పుత్రిక. దీని తయారీ ద్వారా మస్క్ వేల కోట్లు సంపాదించాడు.. ఇటీవల సైబర్ ట్రక్ అనే మోడల్ తీసుకొచ్చాడు.. ఇది పూర్తిగా ఎలక్ట్రానిక్ వెహికల్.. అంటే చార్జింగ్ చేస్తే.. రోడ్డుమీద రయిమంటూ దూసుకుపోతుంది. టెస్లా కార్లలో అద్భుతమైన సౌకర్యాలు ఉంటాయి.. పైగా ఇది మామూలు కార్ల మాదిరిగా ఉండదు.. పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా.. టెస్లా కార్లలో అనేక రకాల సౌలభ్యాలు ఉంటాయి.
మస్క్ ఆ మధ్య విడుదల చేసిన వీడియో ప్రకారం టెస్లా కార్లు ధ్వంసం కావు. డ్రైవింగ్ కూడా పూర్తి విభిన్నంగా ఉంటుంది. జిపిఎస్ ఆధారంగా కారు గమనాన్ని ఎప్పటికప్పుడు చూడొచ్చు.. పైగా ఇందులో ఉన్న ఏసీ సౌకర్యం.. హిమాలయాల్లో ఉన్న అనుభూతి కలిగిస్తుంది. సీటింగ్.. కూషన్ వంటివి ఇందులో సరికొత్తగా ఉంటాయి.. మనదేశంలో అయితే కుడి వైపు కూర్చొని డ్రైవింగ్ చేయవచ్చు. టెస్లా కార్లు ఎక్కువగా విదేశాలలో కనిపిస్తాయి కాబట్టి.. అక్కడి నిబంధనల ప్రకారం ఎడమవైపు కూర్చొని డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది.
టెస్లా కార్లకు అధికంగా ధర ఉండడానికి ప్రధాన కారణం.. దాని తయారీకి ఉపయోగించే మెటల్. ఇది కేవలం టెస్లా కార్లలో మాత్రమే వాడుతారు. పైగా టెక్నాలజీ కూడా ఇందులో అద్భుతంగా ఉంటుంది. ఆటో నావిగేషన్.. టైర్లు.. ఇంజన్.. ఇతర సామర్థ్యాలు టెస్లా కార్లలో అంతకుమించి అనే స్థాయిలో ఉంటాయి. అందువల్లే టెస్లా కార్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మనదేశంలో కూడా తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు మస్క్ ఆ మధ్య ఆసక్తి చూపించారు. ఆ తర్వాత అమెరికాలో తయారు చేసిన కార్లను ఇండియాలో అమ్ముతామని పేర్కొన్నారు. దానికి భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో టెస్లా కార్ల తయారీ యూనిట్ ఇండియాలో ఏర్పాటు సాధ్యం కాలేదు.
టెస్లా కార్లను కొనుగోలు చేసిన వారు చాలా జాగ్రత్తగా వాడుతుంటారు. కానీ సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఒక వీడియోలో మాత్రం ఒక వ్యక్తి చాలా విచిత్రంగా వాడాడు. టెస్లా కార్ల మీద సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేశాడు. ఆ ఫ్యాన్స్ ద్వారా సంగ్రహించుకున్న సూర్య కాంతి నుంచి కారు ఇంజన్ కు శక్తిని అందించే ఏర్పాటు చేశాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం విస్తృతంగా సర్కులేట్ అవుతోంది. ఆ వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం విదేశాలలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. మస్క్ తయారుచేసిన కారు ఇలా వాడుతున్నారు అంటే అతడు ఏమైపోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
