Peddi movie sensational update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరోగా నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని వచ్చే నెల 4 న విడుదల అయ్యేందుకు అన్ని దారులు క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని రెండు సార్లు వాయిదా వేశారు. మరోసారి ఎక్కడ వాయిదా వేస్తారో అని అభిమానుల్లో టెన్షన్ ఉండేది. కానీ ఆ టెన్షన్ కి తెరదించుతూ, నేడు కాసేపటి క్రితమే ఆ చిత్ర దర్శకుడు బుచ్చి బాబు వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది . రామ్ చరణ్ అభిమానులను సంబరాలు చేసుకునేలా చేసింది ఈ ప్రకటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా సెకండ్ హాఫ్ ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తి అయ్యిందట. ఫైనల్ ఎడిట్ ని లాక్ చేసేశామని , జూన్ 3 న ప్రీమియర్ షోస్ కి సర్వం సిద్ధమని చెప్పుకొచ్చాడు.
అంతే కాదు ఎడిటింగ్ రూమ్ నుండి ఆయన అప్లోడ్ చేసిన ఫోటోకి కూడా ఫ్యాన్స్ నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. రామ్ చరణ్ లుక్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని , విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎద్దులబండిపై రామ్ చరణ్ ని చూస్తుంటే, రంగస్థలం వైబ్స్ వస్తున్నాయని అంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ఐటెం సాంగ్ ని కూడా పూర్తి చేశారు. ఈ ఐటెం సాంగ్ లో శృతి హాసన్ రామ్ చరణ్ తో కలిసి చిందులు వేసింది. అంతే కాకుండా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో కాసేపు కనిపించబోతుంది అట. చిరంజీవి కొడుకు , కమల్ హాసన్ కూతురు , శ్రీదేవి కూతురు, ఇలా ఈ ముగ్గురు వెండితెర పై చిందులు వేస్తే అభిమానులకు కనులపండుగలాగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్ లోని LB స్టేడియం లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. అందుకోసం విలేజ్ స్పోర్ట్స్ థీమ్ తో డిజైన్ చేసిన పల్లెటూరి జాతర వైబ్స్ తో ఒక భారీ సెట్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారట. ప్రస్తుతానికి మేకర్స్ పోలీసుల అనుమతి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా తెలియజేయనున్నారు మేకర్స్.