Five States Election Results 2026: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఈ ఫలితాలు ఉన్నాయి. బిజెపికి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ప్రధానంగా పార్టీ పశ్చిమ బెంగాల్ తో పాటు అస్సాంలో సత్తా చాటింది. పుదుచ్చేరిలో కూడా ప్రభావం చూపింది. తమిళనాడులో రెండో కూటమిగా నిలిచింది ఎన్డీఏ. ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అయితే ఆయన కేవలం ఎన్డీఏ కు మంచి ఫలితాలు రావడం పైనే స్పందించారు. తమిళనాడులో విజయ్, కేరళలో కాంగ్రెస్ కూటమి విజయం పై మాత్రం ఆయన నేరుగా స్పందించలేదు. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతకు ప్రజలు ఇచ్చిన బహుమానంగా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ట్రీట్ చేశారు.
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో..
చంద్రబాబు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బిజెపికి మద్దతుగా అక్కడ ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు. అయితే అక్కడ బిజెపి నేరుగా పోటీ చేసింది తక్కువ. అన్న డీఎంకే కూటమితో కలిసి కేవలం 27 అసెంబ్లీ సీట్లకు పోటీ చేసింది. బిజెపి కూటమికి మద్దతుగా ఏపీ సీఎం రంగంలోకి దిగారు. ఇక్కడ అనూహ్యంగా విజయ్ టీవీ కే పార్టీ పుంజుకుని ముందు వరుసలో నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది చంద్రబాబుకు ఉపశమనం కలిగించే విషయం. ఎందుకంటే ఆయన ప్రచారం చేసిన దృష్ట్యా మరోసారి డిఎంకె అధికారంలోకి వచ్చి ఉంటే.. రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబును తక్కువ చేసి చూసేవారు. కానీ చంద్రబాబు ప్రచారం చేసిన బిజెపి కూటమి రెండో స్థానంలో నిలిచింది. పైగా అక్కడ విజయ్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టే ఛాన్స్ ఉంది. కానీ చంద్రబాబు మాత్రం విజయ్ పేరును ప్రస్తావించలేదు. రెండు అతిపెద్ద కూటమిగా నిలవడంపై మాత్రం ఆనందం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ ఫలితం పై..
మరోవైపు పశ్చిమ బెంగాల్లో బిజెపి విజయం సాధించడం పై చంద్రబాబు నేరుగా హర్షం వ్యక్తం చేశారు. అస్సాం తో పాటు పుదుచ్చేరిలో కూడా బిజెపి విజయం సాధించింది. అయితే ఎక్కడ రాజకీయ ప్రత్యర్థులపై వ్యాఖ్యానించకుండా.. బిజెపి విజయం పైనే స్పందించారు చంద్రబాబు. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారని అంతా భావించారు. కానీ అటువైపు వెళ్ళలేదు. తమిళనాడులో ప్రచారం చేసినందుకుగాను కొంతమంది ఫలితాలు కనిపించాయి. అందుకే ఇప్పుడు నేరుగా సోషల్ మీడియా ద్వారా స్పందించారు చంద్రబాబు.
NDA’s victory today reflects the people’s continued and growing confidence in the leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi Ji and his vision for Viksit Bharat. It reinforces the NDA as the confluence of the people’s aspirations, guided by the spirit of Sabka Saath,…
— N Chandrababu Naidu (@ncbn) May 4, 2026