Chiranjeevi Songs: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) డ్యాన్స్ ని నచ్చనోళ్లు ఉంటారా చెప్పండి..? , నేడు పాన్ ఇండియా లెవెల్లో గొప్ప కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్న ప్రభుదేవా , లారెన్స్ వంటి దిగ్గజాలకు కూడా డ్యాన్స్ విషయం లో మెగాస్టార్ చిరంజీవి ఆదర్శం. ఆయన సినిమాల్లోని పాటలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసే వాళ్ళు పెద్ద స్థాయికి వెళ్లారు. అప్పటి హీరోలు డ్యాన్స్ చేస్తున్నారో , ఫైట్స్ చేస్తున్నారో కూడా అర్థం అయ్యేది కాదు , అంత విచిత్రంగా ఉండేది. అలాంటి రోజుల్లోనే మన మెగాస్టార్ చిరంజీవి 2020 కాలం నాటి డ్యాన్స్ ఎలా ఉంటుందో అప్పటి ఆడియన్స్ కి చూపించాడు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఫేమ్ కేవలం ఇండియా వరకే పరిమితం అనుకుంటే పెద్ద పొరపాటు , ఆయన స్థాయి ఆరోజుల్లోనే ఖండాలు దాటిపోయింది. అందుకు బెస్ట్ ఉదాహరణ ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ చిరంజీవి డ్యాన్స్ ని ఇష్టపడడమే.
పూర్తి వివరాల్లోకి వెళ్తే మైఖేల్ జాక్సన్ బ్రతికి ఉన్న రోజుల నుండే ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అది ఇప్పటికీ యూట్యూబ్ లో అందుబాటులోనే ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ లోకి వెళ్లి, మైఖేల్ జాక్సన్ ఫేవరేట్ ప్లే లిస్ట్ అనే సెక్షన్ ఓపెన్ చేసి చూస్తే అందులో 19 వీడియోలు ఉంటాయి. ఆ 19 వీడియోల్లో మెగాస్టార్ చిరంజీవి ‘దొంగ’ చిత్రం లోని ‘గోలీమార్’ అనే పాట ఉంటుంది. 18 ఏళ్ళ క్రితం మైఖేల్ జాక్సన్ తన యూట్యూబ్ ఛానల్ లో మీ ప్లే లిస్ట్ ని క్రియేట్ చేసాడు. ఈ సాంగ్ ని మెగాస్టార్ చిరంజీవి మైఖేల్ జాక్సన్ పాపులర్ హాలోవెన్ వీడియో సాంగ్ ఆధారంగా చేసుకొనే తన ‘దొంగ’ చిత్రం లో రీ క్రియేట్ చేసాడు , ఆరోజుల్లో ఈ పాట ఒక సంచలనం.
ప్రపంచవ్యాప్తంగా పాప్ కింగ్ లో కోట్లాది మంది అభిమానులు ఆరాధించే మైఖేల్ జాక్సన్ లాంటి దిగ్గజానికే మెగాస్టార్ చిరంజీవి పాట అంతలా నచ్చిందంటే , మెగాస్టార్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆరోజుల్లో చిరంజీవి సృష్టించిన సునామీ ఎలాంటిదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. రీసెంట్ గా మైఖేల్ జాక్సన్ బయోపిక్ పై ‘మైఖేల్’ అనే చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదలైన ఈ సినిమాకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అందులో కూడా ఈ పాటని రీక్రియెట్ చేయడం చూసి, ఇది మన చిరంజీవి పాట కదా అని చాలా మంది అనుకున్నారు. ఆ రేంజ్ ఇంప్యాక్ట్ క్రియేట్ చేసాడు మన మెగాస్టార్.