LIK Box Office Collection: ఈమధ్య కాలం లో నెగెటివ్ టాక్ ని సొంతం చేసుకునే సినిమాలు రెండవ రోజుకే దారుణంగా పడిపోతున్నాయి. కానీ కొంత మంది హీరోలు వరుసగా విజయాలను మైంటైన్ చేస్తూ, తమ మార్కెట్ ని సినిమా సినిమాకు పెంచుకుంటూ వెళ్తుంటారు చూడండి , అలాంటి హీరోలు మాత్రం ఫ్లాప్ అవ్వాల్సిన సినిమాలను కూడా ఎబోవ్ యావరేజ్ రేంజ్ కి తీసుకొచ్చేస్తున్నారు. అలాంటి హీరోల జాబితాలోకి ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) కూడా చేరిపోయాడు. మొదటి మూడు సినిమాలతో వరుసగా వంద కోట్ల గ్రాస్ ని అందుకుంటూ , యూత్ ఆడియన్స్ లో ఒక బలమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఆ మూడు సినిమాల ద్వారా ఆయన క్రియేట్ చేసుకున్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా, ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన ‘LIK’ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా ఎబోవ్ యావరేజ్ దిశగా అడుగులు వేస్తోంది.
మూడు రోజుల్లో నెగెటివ్ టాక్ మీద ఈ సినిమా సాధించిన గ్రాస్ వసూళ్లను చూస్తే మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు. కేవలం ఒక్క తమిళనాడు ప్రాంతం నుండే ఈ చిత్రం 18 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో చాలా మందికి ఈ సినిమా విడుదల అయ్యిందనే విషయం కూడా తెలియదు. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి 5 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. దీనిని బట్టీ జెన్ జీ యూత్ లో ప్రదీప్ బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి ఈ చిత్రానికి 3 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా , రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రానికి మొదటి మూడు రోజులకు కలిపి 7 లక్షల డాలర్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 6 కోట్ల 55 లక్షల రూపాయిలు అన్నమాట. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మొదటి మూడు రోజులు తెలుగు + తమిళ వెర్షన్స్ కి కలిపి 34 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రోజుల వారీగా వచ్చిన గ్రాస్ ని ఒకసారి పరిశీలిస్తే , మొదటి రోజు 11 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 2 వ రోజున 12 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక మూడవ రోజున కేవలం 10 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సోమవారం నుండి ఇక కలెక్షన్స్ రావడం ఆగిపోతాయని అనుకున్నారు కానీ, నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 3 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి.