Aligarh Muslim University: యూనివర్సిటీలు అంటే ఉన్నత విద్యా కేంద్రాలు. విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దే విద్యా నిలయాలు. కానీ మన దేశంలో కొన్ని యూనివర్సిటీలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఒకప్పుడు దేశభక్తిని, జాతీయ వాదాన్ని పెంపొందించిన యూనివర్సిటీలు ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారతున్నాయి. ఢిల్లీలోని జేఎన్‌టీయూ, అల్‌ఫలా యూనివర్సిటీల్లో జరిగిన కార్యకలాపాలే ఇందుకు నిదర్శనం.
అలీగఢ్‌లో హాస్టల్‌లో ఉగ్ర జాడలు..
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ హాస్టల్‌లో పోలీస్‌లు ఇటీవల జరిపిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. హాస్టల్‌లోని ఓ గదిలో వాడేందుకు సిద్ధమైన బుల్లెట్లు, పిస్తోల్ మ్యాగజిన్‌లు, నకిలీ కరెన్సీ నోట్లు, ఫోర్జరీ పత్రాలు, 8 మొబైల్ ఫోన్లు లభించాయి. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ, ఈ పదార్థాలు దాచి ఉన్నాయి. ఇటీవల యూనివర్సిటీకి సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలతో లింక్ భావిస్తున్నారు.
షెహబాజ్ అనుమానాస్పద చర్యలు
హాస్టల్ రూమ్‌లో షెహబాజ్ అనే వ్యక్తి ఉండటం అతి అసాధారణం. అధికారిక విద్యార్థి కాకుండా, నకిలీ డాక్యుమెంట్లతో అక్రమంగా ఉంటున్నాడు. రాత్రి మాత్రమే బయటకు వెళ్లి, పగలు రూమ్‌లో దాక్కోవడం అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పోలీసులు అతని సిమ్ కార్డులు, కాల్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తున్నారు. అతను తప్పించుకున్నాడు.
ఇక్కడే విభజన మూలాలు..
ఈ యూనివర్సిటీ 1920లో స్థాపించబడింది,రాజా మహేంద్రప్రతాప్ దీనిని స్థాపించాడు. కానీ యూనివర్సిటీలో అతని పొటో లేదు. ఇక్బాల్ రెండు దేశ సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రచారం చేశాడు. షేక్ అబ్దుల్లా కశ్మీర్ విభజనకు కారణమైనవాడు. దేశ విభజనకు కారణమైన జిన్నా ఫొటో ఉంది. ఇక్కడ చదివే హిందూ విద్యార్థులు మతపరమైన వివక్షకు గురవుతున్నారు.
భద్రతా లోపాలపై విచారణ..
యూనివర్సిటీ నిర్వహణలో గ్రేట్ ల్యాప్స్. హాస్టల్స్‌లో ఐడీ వెరిఫికేషన్ లేకపోవడంతో ఉగ్రవాదులు అడ్డాగా మార్చుకుంటున్నారు. ఇలాంటి కేంద్రాలు జాతీయ భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. దొరికిన మొబైల్స్‌లోని డేటా వెల్లడి చేస్తే పెద్ద నెట్‌వర్క్ బయటపడవచ్చు. పోలీసులు ఎన్‌ఐఏతో కలిసి విచారణ జరుపుతున్నారు.
యూనివర్సిటీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ఐడీ, రెగ్యులర్ రైడ్‌లు చేయాలి.
కఠిన నిబంధనలు అమలు చేయాలి. విద్యార్థులను దేశభక్తి మార్గంలో మళ్లించాలి. ఉగ్ర కార్యకలాపాలకు యూనివర్సిటీలు అడ్డాగా మారకుండా చూడాలి.