Best 7 Seater Cars In India 2026: భారతీయ ఆటో మోబైల్ రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. దేశంలో కార్ల కొనుగోలు శక్తి పెరుగుతుండటంతో కంపెనీలు సైతం లాభాల బాటలో పయనిస్తున్నాయి. అయితే గతంలో కంటే ఇప్పుడు వినియోగదారుల ఆలోచనలు మారిపోతున్నాయి. ఒకప్పుడు చిన్న కారు ఉంటే సరిపోతుంది అని అనుకునేవారు.. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఒకేసారి విహారయాత్రలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉండాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 7 సీటర్ కారు కోసం వెతుకుతున్నారు. ఇలాంటి వారి కోసం ముందుగానే కంపెనీలు 7 సీటర్ కార్లను అందుబాటులో ఉంచుతున్నాయి. వీటిలో కొన్ని కంపెనీలు అద్భుతమైన ఫీచర్లను అందించడంతో పాటు అన్ని వర్గాల వారిని ఆకర్షించే ధరలో మార్కెట్లోకి తీసుకురాబోతున్నాయి. ఇలాంటి వాటిలో ఉన్న టాప్ 5 కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
సెవెన్ సీటర్ కారు కొనాలని ఆలోచించేవారు ముందుగా VinFast కారు గురించి ఆలోచించాలని నిపుణులు అంటున్నారు. ఈ కంపెనీకి చెందిన MPV7 పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్ కారు. ఈ కారును ఒక్కసారి చార్జింగ్ చేస్తే 450 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వినియోగదారులను ఆకర్షించేలా బాక్సి డిజైన్తో ఉన్న ఈ కారు లో ఫ్యామిలీ అంతా కలిసి దూర ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉండే ఈ కారు త్వరలో మార్కెట్లోకి రాబోతుంది.
ప్రముఖ లగ్జరీ వాహనాల కంపెనీ MG Motors నుంచి అద్భుతమైన సెవెన్ సీటర్ కారు అందుబాటులోకి రాబోతుంది. అదే మెజిస్టర్. ఇందులో 2.0 ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్ ను చూడొచ్చు. అలాగే LED హెడ్ లాంప్స్ ఆకర్షణీయంగా ఉండడంతో పాటు 64 రంగుల యాంబియంట్ లైటింగ్ను అందిస్తుంది. 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ తో పాటు 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే ఉండే ఈ కారులో సెక్యూరిటీ కోసం 2 Adas వంటి ఫీచర్లు ఉన్నాయి.
టయోటా కంపెనీకి చెందిన ఎన్నో రకాల సెవెన్ సీటర్ కార్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అయితే త్వరలో ఈ కంపెనీ నుంచి కొత్తగా ఫార్చ్యూనర్ రాబోతుంది. ఇది 48 V మైండ్ హైబ్రిడ్ డీజిల్ ఇంజన్ తో పాటు లెవెల్ 2 ADAS సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే దీని క్యాబిన్ పాత ఫార్చ్యూనర్ కంటే ఎన్నో మార్పులు చేశారు. కొత్త దానిలో డ్యూయల్ 12.3 అంగుళాల డిస్ప్లే లు ఉండనున్నాయి.
Volkswagen కంపెనీ నుంచి కొత్తగా రాబోయే R లైన్ కారు 7 సీటర్ గా అలరించనుంది. ఇందులో 2.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇప్పటికే ఈ కారు గ్లోబల్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ ను పొందింది. ఇందులో డ్యూయల్ ఛాంబర్ హలోజన్ హెడ్ లాంప్స్ తో పాటు 16 అంగుళాల స్టీల్ వీల్స్ వంటివి చూడొచ్చు
చివరగా Skoda కంపెనీకి చెందిన Kodoaq RS అనే 7 సీటర్ కారు రాబోతుంది. దీని కలర్ చూస్తేనే కొనుగోలు చేయాలన్నంత ఉత్సాహం ఉంటుంది. ఈ కారులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండనుంది.