Homeబిజినెస్Toyota Highlander: విశాలమైన క్యాబిన్ కలిగిన Toyota కొత్త కారు త్వరలో మార్కెట్లోకి.. ధర ఎంత...

Toyota Highlander: విశాలమైన క్యాబిన్ కలిగిన Toyota కొత్త కారు త్వరలో మార్కెట్లోకి.. ధర ఎంత అంటే?

Toyota Highlander: విశాలమైన కారు కావాలని అనుకునే వారికి Toyota కంపెనీ నుంచి ఆకర్షణీయమైన వెహికల్స్ మార్కెట్లోకి వస్తుంటాయి. వీటిలో 2000 సంవత్సరంలో న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో మొదటిసారిగా Toyota Highlander ప్రదర్శించారు. ఆ సమయంలో మిడ్ SUV గా వచ్చిన ఈ కారు అందరిని ఆకర్షించింది. ఇందులో ఇంటీరియర్ విశాలంగా ఉండడంతో కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి అనుగుణంగా ఉండేది. అయితే ఆ తర్వాత ఈ కారు పలు మార్పులు చెందుతూ వస్తుంది. ఇంటీరియర్ ఫీచర్స్ తో పాటు సేఫ్టీ ఫీచర్స్ కూడా చేర్చారు. అలాగే పవర్ ట్రెయిన్ సామర్థ్యం కూడా పెరిగింది. ఇప్పుడు Toyota Highlander ఎలక్ట్రిక్ వేరియంట్ లో రాబోతుంది. ఐదవ ఎడిషన్ గా 2027 సంవత్సరంలో రోడ్లపైకి వస్తున్న ఈ కారు గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..

SUV కారు కొనాలని అనుకునేవారు Toyota వైఫై ఎక్కువగా చూస్తారు. అయితే ఇప్పుడు Toyota Highlander ఎలక్ట్రిక్ వేరియంట్ గా రాబోతుంది. ఇది ఇప్పటివరకు వచ్చిన నాలుగు ఎడిషన్ల కారు కంటే కాస్త పొడవుగా ఉండే అవకాశం ఉంది. 12.3 అంగుళాలు వెడల్పు, 120,1 అంగుళాల వరకు వీల్ బేస్ పెరిగిందని తెలుస్తోంది. ఇందులో రెండు బ్యాటరీలను ఉంచనున్నారు. వీటిలో ఒకటి 77.0 kWh బ్యాటరీ కాగా.. మరొకటి 95.8kWh. ఈ రెండు బ్యాటరీలు 228 నుంచి 338 హార్స్ పవర్ వరకు అందిస్తాయి. అలాగే 198 నుంచి 323 వరకు టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 270 నుంచి 320 మైళ్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ బ్యాటరీలు 30 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు చార్జింగ్ అవుతుంది.

ఈ కారు ఇంటీరియర్ డిజైన్ లో భాగంగా 14 అంగుళాల టచ్ స్క్రీన్, 12.3 అంగుళాల డ్రైవర్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్, వైర్లెస్ చార్జింగ్, ఇంటిగ్రేటెడ్ స్టోరేజ్ వంటి ఎలివేటెడ్ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో అతిపెద్ద ఫిక్స్డ్ గ్లాస్ పనోరమిక్ రూఫ్ వలే అనిపిస్తుంది. స్టీరింగ్ ఆడియో, 5జి కనెక్టివిటీ, వాయిస్ అసిస్టెంట్ వంటివి సౌకర్యవంతంగా ఉంటాయి. USB చార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ఇందులో కనిపిస్తాయి. ఒకప్పటి కంటే ఇప్పటి టయోటా హై లాండర్ ఎన్నో మార్పులు చేసుకుంటున్నప్పటికీ ఇంజన్ పనితీరు మెరుగ్గా ఉంచుతున్నారు. అలాగే ఈ కారు ధర గురించి అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే కొన్ని అంచనాల ప్రకారం..రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular