Coins River: భారతదేశ ఆచార, సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని అంటారు. ఇక్కడ పురాతన కాలంలో ఆరోగ్య, అవసరాల దృష్ట్యా కొన్ని ఆచారాలను ఏర్పాటు చేశారు. వాటిని తరతరాలుగా పాటిస్తూ వస్తున్నారు. అప్పటి కాలంలో ఈ ఆచారాలు కేవలం ఆధ్యాత్మికం కోసమే కాకుండా ప్రకృతిని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేసేవారు. అయితే ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ అవే ఆచారాలు పాటించడం మంచివే. కానీ సైన్స్ దృష్టిగా కొన్నింటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చాలామంది ఆచార వ్యవహారాలను పాటించాలి అన్నట్లుగా.. వాటిని ఫాలో అవుతున్నారు. ఇలా ఫాలో కావడం వల్ల ప్రకృతిలో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని గుర్తించడం లేదు. వీటిలో దీని గురించి చెబితే..
ప్రతిరోజు ఇంట్లో చేసే స్నానం కంటే నదీ స్నానం చేయడం చాలా ఉత్తమం. అందుకే పండుగలు, ప్రత్యేక పర్వదినాల్లో నది స్నానం చేయాలని అనుకుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలని చాలామంది సమీప నదుల వద్దకు వెళ్తారు. ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చే ఈ నీటిలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో గ్లోబలైజేషన్ కారణంగా ఈ నీరు కలుషితంగా మారుతుంది. అలాగే కొందరు ఆచార, సాంప్రదాయాల పేరిట నీటిని కలుషితం చేస్తున్నారు.
కొందరు ఈ నీటిలో స్నానం చేసే సమయంలో కాయిన్స్ వేస్తుంటారు. ఇలా కాయిన్స్ వేయడం పూజలో భాగం అని అనుకుంటారు. వాస్తవానికి పూర్వకాలంలో ఇలా కాయిన్స్ వేసేవారు. ఆ సమయంలో వారు వేసే కాయిన్స్ పూర్తిగా రాగితో తయారుచేసినవి. ఈ రాగి కాయిన్స్ నీటిలో వేయడం వల్ల నీరు స్వచ్ఛంగా మారేది. ఆ నీటిని కొన్ని ప్రాంతాల్లో తాగే వారు కూడా. రాగితో మిళితమైన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం కూడా కలుగుతుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది వేసే కాయిన్ స్టేయిన్లెస్తో తయారవుతుంది. ఇలా స్టెయిన్లెస్ తో తయారైన కాయిన్ వేయడం వల్ల ఎప్పటికీ నీటిలో ఉండి తుప్పు పట్టిపోతుంది. ఇలా తుప్పు పట్టిన నీరు కలిసితంగా మారుతుంది. ఈ నీటిలో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అందువల్ల నదీ స్నానం చేసే సమయంలో నీటిలో కాయిన్స్ వేసే విషయం ఆలోచించాలి అని కొందరు పర్యావరణవేత్తలు అంటున్నారు. ఒకప్పుడు పాటించిన ఆచారాలను ఇప్పుడు కొనసాగించడం మంచివే. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా.. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆచారాలను కొనసాగించాలని చెబుతున్నారు.