Rajamouli: దర్శక ధీరుడిగా తనకంటూ ఒక గొప్ప ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి…ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇప్పటివరకు మన చేసిన సినిమాలు అతనికి గొప్ప విజయాలను అందించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక దాంతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఆయన ఒక ఈవెంట్ ను కండక్ట్ చేసి సినిమాకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ను ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక అందులో భాగంగానే హీరో పోస్టర్ తో పాటు గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఇక హీరోయిన్ ఫస్ట్ పోస్టర్ ను, అలాగే విలన్ పృథ్వీ రాజ్ సుకుమారన్ యొక్క పోస్టర్ ను సైతం రిలీజ్ చేశాడు.
వీటన్నింటితో రాజమౌళి విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికి వాటిని పట్టించుకోకుండా తన బిజినెస్ స్ట్రాటజీ లతో ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడనే కాదు రాజమౌళి చేసిన ప్రతి సినిమా విషయంలో పోస్టర్ రిలీజ్ చేసిన, టీజర్ ను రిలీజ్ చేసిన కూడా ఏదో ఒక విమర్శ ఎదుర్కొంటున్నాడు.
కానీ ఆయన వాటిని పట్టించుకోడు. తన సినిమా ప్రేక్షకుడికి నచ్చాలనే ఉద్దేశ్యంతో దానికోసమే అనుక్షణం తపిస్తాడు తప్ప మిగతాది ఏది కాదని పలువురు సినిమా మేధావులు కూడా చెబుతున్నారు. ఇక అందులో భాగంగానే వారణాసి సినిమా నేపథ్యంలో ఇప్పటి నుంచే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ను చేపడుతూ భారీ ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు.
పాన్ వరల్డ్ లో ప్రేక్షకుల గురించి ఏ విధంగా చేయాలంటే ఇప్పటినుంచే ప్రమోషన్స్ చేయాలని తను అనుకుంటున్నాడు… అందుకే మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఇంటర్వ్యూలను మెప్పిస్తున్నాడు. మరి రాజమౌళి స్ట్రాటజీ ఏంటనేది ఎవరికి అర్థం కాదు. కానీ ఫైనల్ గా మాత్రం ఆయన తన సినిమాను రిలీజ్ రోజే ప్రేక్షకుడు చూడడానికి ప్రేక్షకుల్లో ఒక ఉత్సాహాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు అనేది వాస్తవం…