Star Heroine: ఇండస్ట్రీ లో ఏది జరిగిన అదొక సెన్సేషనల్ న్యూస్ గానే నిలుస్తోంది… సినిమా ఇండస్ట్రీ కి ఉన్న క్రేజ్ అలాంటిది. మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతారు. లేకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రిలో చాలావరకు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలైతే ఉన్నాయి. ఎవరైతే వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటారో వాళ్ల కోసం అభిమానులు ప్రాణాలైనా ఇస్తారు… ప్లాపుల్లో ఉన్నవాళ్ళని ఎవ్వరు పట్టించుకోరు…ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు కూడా గుర్తుకు వస్తూ ఉంటారు. ప్రతి హీరోయిన్ వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తారు… కొన్ని సందర్భాల్లో వాళ్లను కొంతమంది లైగికంగా వేధించారు అంటూ కొన్ని వార్తలు వస్తూనే ఉంటాయి. ఇక గతంలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో చాలామంది హీరోయిన్ల మీద లైంగికంగా వేధింపులు జరిగాయని వాళ్ళే ముందుకు వచ్చి చెప్పిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరోసారి ఆయేషా ఖాన్ అనే నటి తను చిన్నతనం నుంచే లైగికంగా వేధింపబడుతున్నానని తన వాళ్ళే తనని లైగికంగా వేధించారని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…
ఆమె తెలుగులో ‘ముఖచిత్రం’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికి వాళ్లకు పెద్దగా గుర్తింపైతే రాలేదు… ఇప్పుడు మరోసారి కొన్ని సినిమాలు చేస్తున్నప్పటికి ప్రేక్షకుల్లో తన పట్ల ఒక అటెన్షన్ క్రియేట్ అవ్వడానికి ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తను లైంగికంగా వేధింపులకు గురయ్యానని చెప్పింది…
చిన్నతనంలో తన నాన్న వాళ్ళ ఫ్రెండ్ అయిన ఒక వ్యక్తి ఆమెతో నీ వక్షోజాలు బాగున్నాయంటూ చెప్పాడట. చిన్నతనంలో ఉండటం వల్ల ఆయన చెప్పిన మాటలు తనకి అర్థం కాలేదని చెప్పింది. అలాగే ఆ వ్యక్తిని బాబాయ్ అని పిలిచేవాడినని కానీ ఆయన మాత్రం చెడు దృష్టితో చేసేవాడని చెప్పింది. ఆ తర్వాత ఒకసారి నన్ను చూసి కన్ను కొట్టి ఏవో వల్గర్ మాటలు మాట్లాడాడు.
దాంతో నేను చాలాసేపటి వరకు ఏడుస్తూ కూర్చున్నానని మొత్తానికైతే నా చిన్నప్పటి నుంచి నా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచే వేధింపులు ఎదుర్కొన్నానని ఇండస్ట్రీలో కూడా అలాంటివి సర్వ సాధారణం అన్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…