Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ‘ఓజీ'(They Call Him OG) మూవీ సూపర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్నారు. రెండు నెలల క్రితమే ‘హరి హర వీరమల్లు’ తో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకొని తీవ్రమైన నిరాశకు గురైన పవన్ ఫ్యాన్స్, ఇప్పుడు ఓజీ చిత్రం తో చాలా కాలం తర్వాత సినిమాల పరంగా ఫుల్ జోష్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ని గ్యాంగ్ స్టర్ రోల్ లో చూసి మురిసిపోతూ పదే పదే థియేటర్స్ కి వెళ్లి చూస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రం కేవలం తెలుగు వెర్షన్ నుండే 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ తో పాటు ప్రీక్వెల్ కూడా ఉంటుందని ఆ చిత్ర డైరెక్టర్ సుజీత్ ఇది వరకే చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా ఈ రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ప్రస్తుతం సుజిత్ నేచురల్ స్టార్ నాని తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం పూర్తి అవ్వగానే వచ్చే ఏడాది ఓజీ ప్రీక్వెల్ మరియు సీక్వెల్ లను చిత్రీకరించబోతున్నాడు. ఇవి 2029 ఎన్నికల లోపు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఓజీ 2 షూటింగ్ మొదలు అవ్వకముందే పవన్ కళ్యాణ్ మరో గ్యాంగ్ స్టర్ మూవీ చేయబోతున్నాడు. చాలా కాలం క్రితమే SRT ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో పవన్ ఒక సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడని అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ ఎందుకో ఈ చిత్రం ఇప్పటి వరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు. స్టోరీ , స్క్రిప్ట్ డైలాగ్ వెర్షన్ తో కలిపి రెడీ గా ఉంది, పవన్ కళ్యాణ్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తామని ఆ చిత్ర నిర్మాత రామ్ తళ్లూరి పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు.
కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో ఫుల్ బిజీ అవ్వడంతో ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఈ చిత్రం సెట్స్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. పవన్ కళ్యాణ్ ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న గ్యాంగ్ స్టర్ రోల్ లో కనిపించబోతున్నాడట. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ ని అందించాడట. గ్యాంగ్ స్టర్ రోల్ లో మళ్లీ పవన్ కనిపించబోతున్నాడు అనే విషయం అభిమానులకు ఆనందాన్ని కలిగించేదే, కానీ సురేందర్ రెడ్డి గత చిత్రం ఏజెంట్ కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ సినిమా లో ఆయన డైరెక్షన్ కూడా చాలా వీక్ అనిపించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనతో చేయడం రిస్క్ ఏమో అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.