Homeఎంటర్టైన్మెంట్Rakshit Shetty Delhi High Court: హీరోయిన్ రష్మిక మాజీ లవర్ పై ఢిల్లీ హై...

Rakshit Shetty Delhi High Court: హీరోయిన్ రష్మిక మాజీ లవర్ పై ఢిల్లీ హై కోర్టు 25 లక్షల జరిమాన..

Rakshit Shetty Delhi High Court: కన్నడ యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు రక్షిత్ శెట్టి(Rakshit Shetty). ఇతను మన తెలుగు ఆడియన్స్ కి ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘చార్లీ ‘, ‘సప్తసాగరాలు ఎల్లో’ వంటి చిత్రాలతో పరిచయం అయ్యాడు. అంతే కాదు ఈయన ప్రముఖ హీరోయిన్ రష్మిక కి మాజీ ప్రియుడు కూడా. అయితే ఇప్పుడు ఇతని పై ఢిల్లీ హై కోర్టు 25 లక్షల రూపాయిల జరిమానా […]

Rakshit Shetty Delhi High Court: కన్నడ యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు రక్షిత్ శెట్టి(Rakshit Shetty). ఇతను మన తెలుగు ఆడియన్స్ కి ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘చార్లీ ‘, ‘సప్తసాగరాలు ఎల్లో’ వంటి చిత్రాలతో పరిచయం అయ్యాడు. అంతే కాదు ఈయన ప్రముఖ హీరోయిన్ రష్మిక కి మాజీ ప్రియుడు కూడా. అయితే ఇప్పుడు ఇతని పై ఢిల్లీ హై కోర్టు 25 లక్షల రూపాయిల జరిమానా విధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈయనకు కన్నడ లో ‘పరంవా స్టూడియోస్ ‘ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఈ సంస్థ ద్వారా ఆయన తన సినిమాలను నిర్మించుకోవడమే కాకుండా, పక్క హీరోలతో కూడా సినిమాలను నిర్మిస్తూ ఉంటాడు. కొన్ని సూపర్ హిట్స్ ని అందుకేనన్నాడు. రీసెంట్ గానే ఈయన ‘బ్యాచిలర్ పార్టీ’ అనే చిత్రాన్ని నిర్మించాడు.

అయితే ఈ చిత్రం లో తమ అనుమతి లేకుండా రెండు పాటలను వాడుకున్నాని MTR మ్యూజిక్ సంస్థ ఢిల్లీ హై కోర్టుని ఆశ్రయించింది. ఈ చిత్రం లోని ‘న్యాయ ఎల్లీదే ‘, ‘ఓమ్మే నిన్నను’ అనే రెండు పాటలు తమ సంస్థకు చెందినవని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, మా అనుమతి తీసుకోకుండా వాటిని వాడుకున్నారని, తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. అయితే రక్షిత్ శెట్టి తరుపున న్యాయవాదులు ‘న్యాయ ఎల్లీదే ‘ పాటలో కేవలం 7 సెకండ్లు, ‘ఓమ్మే నిన్నను’ పాటలో 31 సెకండ్లు మాత్రమే వాడుకున్నామని, ఇంత తక్కువ సమయం వాడుకోవడం హక్కుల ఉల్లఘన క్రిందకు రాదనీ వాదించారు. కానీ హై కోర్టు వాళ్ళ వాదనను తిరస్కరించింది. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా , సినిమా కథకు తగ్గట్టుగానే వాడుకున్నారని, వాణిజ్యపరంగా లాభం కోసమే ఈ పాటలు వాడుకోవడం క్రిందకు వస్తుందని ధర్మాసనం పేర్కొనింది. ఒక పథకం ప్రకారం గానే ‘న్యాయ ఎల్లీదే ‘ పాటని వాడుకున్నారని , ఇది కచ్చితంగా హక్కుల పరిధిలోకే వస్తుందని వెల్లడించిన హై కోర్టు రక్షిత్ శెట్టి ని అరెస్ట్ నుండి తప్పిస్తూ , పాతిక లక్షల రూపాయిల జరిమానా కట్టాల్సిందే అని తీర్పు ని ఇచింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper