Top Telugu Serials: ఆడియన్స్ కి సినిమాలు, క్రికెట్ మాత్రమే కాదు, సీరియల్స్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఒక విధంగా చెప్పాలంటే సినిమాలకంటే ఎక్కువగా టీవీ సీరియల్స్ కి మంచి రీచ్ ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఖాళీ సమయం లో చూసేది టీవీ సీరియల్స్ ని మాత్రమే. అన్ని వయస్సులకు సంబంధించిన వాళ్ళు చాలా ఆసక్తిగా చూస్తుంటారు. అలాంటి సీరియల్స్ లో ప్రస్తుతం టాప్ 5 గా కొనసాగుతున్న వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం.
1 ) గుండె నిండా గుడిగంటలు :
స్టార్ మా ఛానల్ లో ప్రతీ రోజు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాదు , యూత్ కూడా ఈ సీరియల్ ని ఎగబడి చూస్తుంటారు. రెండేళ్ల నుండి ఈ సీరియల్ కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రేక్షకుల ఆదరణ ఇప్పటికీ తగ్గడం లేదు. ఇప్పటికీ ఈ సీరియల్ ని కోటి మందికి పైగా చూస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న. బాలు – మీనా జంటల మధ్య కెమిస్ట్రీ కి ఆడియన్స్ బ్రహ్మారథం పట్టారు అనే చెప్పొచ్చు.
2) పొదరిల్లు :
స్టార్ మా ఛానల్ లో ప్రతీ రోజు రాత్రి 9 గంటల 45 నిమిషాలకు ప్రసారమయ్యే ఈ టీవీ సీరియల్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఒక డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సీరియల్ ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకర్షిస్తోంది. రోజుకి ఈ సీరియల్ ని సగటున 83 లక్షల మంది వీక్షిస్తారని టాక్.
3) కార్తీక దీపం 2:
స్టార్ మా ఛానల్ లో గతం లో ప్రసారమైన ‘కార్తీక దీపం’ అనే సీరియల్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మన అందరికీ తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే ‘మొగలిరేకులు’ సీరియల్ తర్వాత అంతటి రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సీరియల్ ఇదే. ఈ సీజన్ కూడా సూపర్ హిట్ అయ్యింది , మంచి రేటింగ్స్ తో వెళ్తుంది కానీ , మొదటి సీజన్ రేంజ్ కాదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సీరియల్ ని సగటున రోజుకి 81 లక్షల మంది వీక్షిస్తున్నట్టు సమాచారం.
4) ఏ దేవి వరమో నీవు :
ఈమధ్యనే మొదలైన ఈ సీరియల్ , ప్రతీ రోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఈ సీరియల్ కి కూడా ఆరంభం నుండే అద్భుతమైన రేటింగ్స్ నమోదు అవుతున్నాయి. సోనియా, శ్రవణ్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సీరియల్ లో ‘బిగ్ బాస్ 9’ ఫేమ్ సంజన గల్రాని కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సీరియల్ ని సగటున రోజుకి 72 లక్షల మంది వీక్షిస్తున్నట్టు సమాచారం.
5) ఇల్లు ఇల్లాలు పిల్లలు :
స్టార్ మా ఛానల్ లో ప్రతీ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మొదట్లో ఈ సీరియల్ టాప్ 2 స్థానం లో ఉండేది. కానీ కొత్త సీరియల్స్ రాకతో కాస్త తగ్గింది. ప్రభాకర్ , సీనియర్ హీరోయిన్ ఆమని ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామా కి సగటున రోజుకి 69 లక్షల మంది వీక్షిస్తున్నట్టు సమాచారం.
టాప్ 5 లో అన్నీ స్టార్ మా ఛానల్ కి సంబంధించిన సీరియల్స్ ఉండడం గమనార్హం. జెమినీ టీవీ నుండి అన్నపూర్ణ క్యాటరింగ్, మా ఇంటి దేవత , ముక్కెర మీనాక్షి వంటి సీరియల్స్ కి మంచి రేటింగ్స్ వస్తున్నాయి , అదే విధంగా జీ తెలుగు లో ప్రసారం అవుతున్న జగదాత్రి సీరియల్ కి మంచి రేటింగ్స్ వస్తున్నాయి అట.