Homeలైఫ్ స్టైల్Sleep Problems : పడుకున్న వెంటనే నిద్ర పట్టకపోవడానికి అదే కారణం..

Sleep Problems : పడుకున్న వెంటనే నిద్ర పట్టకపోవడానికి అదే కారణం..

Sleep Problems : రాత్రి పడుకున్న వెంటనే నిద్ర పట్టాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ఆలోచనలు ఉండడం వల్ల బెడ్ పైకి వెళ్లిన వెంటనే నిద్ర రాదు. కొందరు గంటల తరబడి మెలకువగానే ఉంటారు. మరికొందరికి నిద్ర పట్టినా మధ్య మధ్యలో మెలకువ వస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం కార్టిసాల్ అనే హార్మోన్ అసమతుల్యత అని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. అసలేంటీ ఈ కార్టిసాల్ హార్మోన్? కార్టిసాల్ […]

Sleep Problems : రాత్రి పడుకున్న వెంటనే నిద్ర పట్టాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ఆలోచనలు ఉండడం వల్ల బెడ్ పైకి వెళ్లిన వెంటనే నిద్ర రాదు. కొందరు గంటల తరబడి మెలకువగానే ఉంటారు. మరికొందరికి నిద్ర పట్టినా మధ్య మధ్యలో మెలకువ వస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం కార్టిసాల్ అనే హార్మోన్ అసమతుల్యత అని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. అసలేంటీ ఈ కార్టిసాల్ హార్మోన్?

కార్టిసాల్ అనేది అడ్రినల్ గ్రంథులు ఉత్పత్తి చేసే హార్మోన్. ఇది శరీరంలో శక్తి వినియోగం, రక్తంలో చక్కెర స్థాయిలు, రోగనిరోధక వ్యవస్థలను నియంత్రిస్తుంది. సాధారణంగా ఉదయం లేవగానే ఈ హార్మోన్ స్థాయిలు ఎక్కువగా ఉండి, రోజంతా క్రమంగా తగ్గుతూ రాత్రి నిద్రపోయే సమయానికి చాలా తక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రమే శరీరం విశ్రాంతి మోడ్‌లోకి వెళ్లి నిద్ర సులభంగా పడుతుంది.

ఒక శరీరంలో ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి సమయంలో కూడా కార్టిసాల్ స్థాయిలు తగ్గకుండా ఉంటాయి. దీంతో మెదడు అప్రమత్తత అనే స్థితిలోనే ఉంటుంది. దీంతో నిద్ర పట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ నిద్రపోయినా తరచూ మెలకువ రావడం, తెల్లవారుజామునే లేచిపోవడం, నిద్ర పూర్తిగా కాలేదన్న భావన కలుగుతుంది. దీర్ఘకాలం ఇలా కొనసాగితే శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి.

కార్టిసాల్ హార్మోన్ తగ్గకపోవడానికి అధిక పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆందోళన వంటివి ఉంటాయి. అలాగే రాత్రిళ్లు ఎక్కువసేపు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించడం కూడా ఈసమస్యకు కారణమవుతుంది. నిద్రలేమితో పాటు ఉదయం లేవగానే అలసటగా ఉండటం, రోజంతా చిరాకు, ఏకాగ్రత తగ్గిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఎక్కువ రోజులు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా వ్యాయామం చేయడం వల్ల కార్టిసాల్ స్థాయిలు సమతుల్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాత్రి పడుకునే గంట ముందు మొబైల్, టీవీ వంటి స్క్రీన్‌లకు దూరంగా ఉండాలి. ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు కూడా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper