ICC : ప్రఖ్యాత క్రికెట్ స్పోర్ట్స్ వెబ్ సైట్, యూట్యూబ్ ఛానల్ crick Buzz సంచలన విషయాలను వెల్లడించింది..క్రిక్ బజ్ నివేదిక ప్రకారం కోతులు కోతులు మరి ఐసీసీ కమిటీ వన్డే ఫార్మాట్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుందామని తెలుస్తోంది. ఇప్పటివరకు వన్డే మ్యాచ్ లో ఒకే ఒక బంతిని వినియోగిస్తున్నారు. ఒకవేళ ఆ బంతి పాత బడితే.. అంపైర్ల నిర్ణయం మేరకు కొత్త బంతిని ఉపయోగిస్తున్నారు. అయితే ఐసీసీ నియమించిన కమిటీ సిఫారసు చేసిన సూచనల ప్రకారం భవిష్యత్ కాలంలో జరిగే వన్డే మ్యాచ్ లలో 25 ఓవర్లకు ఒక బంతిని.. ఆ తదుపరి 25 ఓవర్లకు మరో బంతిని ఉపయోగిస్తారని తెలుస్తోంది. అంతేకాదు బౌలింగ్ జట్టు సిఫారసు మేరకే కొత్త బంతిని అందిస్తారు. కొత్త బంతి వల్ల బౌలింగ్ చేసే జట్టు రివర్స్ స్వింగ్ రాబట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు బ్యాటింగ్ చేసే జట్టుకు కాస్త ప్రతిఘటన తప్పక పోవచ్చు. అయితే కొన్ని మ్యాచ్లలో బ్యాటర్లు ఏకపక్షంగా బౌలర్లపై దాడికి దిగుతున్నారు. దీనివల్ల బౌలర్లకు ఇబ్బందికరంగా ఉంటున్నది. అయితే ఈ సిఫారసు గనుక అమల్లోకి వస్తే.. వన్డేలలో పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.. అయితే చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే ఐసీసీ వన్డేలలో మార్పులు తీసుకురావాలని భావించింది. ఇందులో భాగంగానే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మాజీ, ప్రస్తుత ప్లేయర్లతో మాట్లాడింది. వారి నుంచి సలహాలు స్వీకరించింది. ఆ తర్వాత నివేదికను ఐసీసీ కి సమర్పించింది.
ALso Read : ఫస్ట్ అన్ క్వాప్డ్ కెప్టెన్ ధోని.. ఇంకా ఎన్నో ఘనతలు..
ఎప్పటినుంచంటే
వన్డేలో రెండు కొత్త బంతుల విధానానికి త్వరలోనే ఐసీసీ శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఐసీసీ వన్డేల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకానొక దశలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నిలిపివేయాలని భావించింది. వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఒకే విధంగా ఉండడంతో.. ఛాంపియన్స్ ట్రోఫీని నిలిపివేయాలని అనుకుంది. క్రికెట్ కు ఆదరణ పెరగడం.. టి20 తరహాలోనే వన్డే కి కూడా క్రేజ్ ఉండడంతో.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విషయంలో పునరాలోచన చేసింది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ దేశానికి ఐసీసీ చాంపియన్స్ నిర్వహణ హక్కులు కేటాయించింది. ఇక వన్డే ఫార్మాట్ లో రెండు కొత్త బంతుల విధానానికి శ్రీకారం చుట్టిన ఐసీసీ.. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే ప్రతి మ్యాచ్ లోనూ బ్యాటర్లు ఏకపక్షంగా బౌలర్ల పై ఎదురు దాడి చేయకుండా ఉండేందుకు.. ఐసీసీ రెండు కొత్త బంతుల విధానానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇది గనక అమల్లోకి వస్తే బౌలర్లకు ఎంత కొంత ప్రయోజనం దక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త బంతి వల్ల బౌలర్లు ఇన్ స్వింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొత్త బంతి పై గ్రిప్ అధికంగా ఉండడం వల్ల.. పరుగుల వరద పారుతున్న సమయంలో బ్యాటర్లను బౌలర్లు కట్టడి చేసే అవకాశం కూడా ఉంది.
Also Read ; పోటీలో ముగ్గురు.. రుతు రాజ్ గైక్వాడ్ స్థానంలో ఎవరు?