కరోనా కట్టడికి ఫేస్ బుక్ వ్యవస్థాకుడి భారీ విరాళం
చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తోంది. ప్రపంచంలోని 200దేశాలకు కరోనా పాకింది. కరోనా మహమ్మరి దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. కరోనా ఎఫెక్ట్ తో అన్నిరంగాలు దెబ్బతింటున్నాయి. కరోనా నివారణ చేసే పరిశోధనలకు విరాళం అందించేందుకు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ దంపతులు ముందుకొచ్చారు. కరోనా వైరస్ నివారణ కోసం చేసే పరిశోధనలకు 25మిలియన్ డాలర్లు(రూ. 187కోట్లు) విరాళంగా ఇస్తున్నట్లు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్గ్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిస్కిలా […]

చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తోంది. ప్రపంచంలోని 200దేశాలకు కరోనా పాకింది. కరోనా మహమ్మరి దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. కరోనా ఎఫెక్ట్ తో అన్నిరంగాలు దెబ్బతింటున్నాయి. కరోనా నివారణ చేసే పరిశోధనలకు విరాళం అందించేందుకు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ దంపతులు ముందుకొచ్చారు.
కరోనా వైరస్ నివారణ కోసం చేసే పరిశోధనలకు 25మిలియన్ డాలర్లు(రూ. 187కోట్లు) విరాళంగా ఇస్తున్నట్లు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్గ్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిస్కిలా చాన్ ప్రకటించారు. ఈమేరకు బిల్ అండ్ మిళింద గేట్స్ ఫౌండేషన్ తో కలిసి పని చేస్తామని వారు ప్రకటించారు. 125మిలియన్ డాలర్లతో ఇప్పటికే మిళింద ఫౌండేషన్ కరోనా నివారణకు కార్యాచరణ చేపట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ 7లక్షలు దాటేసింది. 33వేలకు పైగా మృత్యువాత పడ్డారు. అమెరికాలో లక్షకు పైగా కేసులతో తొలిస్థానంలో నిలిచింది. అగ్రరాజ్యం కరోనా దెబ్బకు విలవిలాడుతోంది. ఆ తర్వాత ఇటలీ, చైనా, స్పెయిన్, జెర్మనీ, ఇరాన్ దేశాల్లో అత్యధికం కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక భారత్ లోనూ వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో ఆందోళన నెలకొంది. అయితే కరోనాపై పోరుకు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బెర్గ్ దంపతులు ముందుకురావడంపై ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి.