YS Vijayamma Resigned: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి కష్టాలే ఎదురుకానున్నాయి. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తన పదవికి రాజీనామా చేస్తారనే వాదనలు వస్తున్నాయి. దీంతో పార్టీకి నష్టాలే పలకరించనున్నట్లు తెలుస్తోంది. జగన్ తో పడలేకే విజయమ్మ పార్టీ నుంచి దూరంగా జరిగేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇన్నాళ్లు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వ్యతిరేకించినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆమె తన సొంత నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. ఎలాగూ కొడుకు చెప్పినట్లు వినడం లేదనే ఉద్దేశంతోనే పార్టీకి దూరంగా జరగాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే సోదరి షర్మిల తెలంగాణలో వైఎస్సార్ టీపీ పేరుతో పార్టీని స్థాపించి అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలను విమర్శిస్తున్నారు. జగన్ అధికారంలోకి రావడానికి ఎన్నో విధాలుగా కష్టపడిన విజయమ్మ, షర్మిలకు పార్టీలో ఎలాంటి గుర్తింపు లేకపోవడంతోనే వారు వేరు కుంపటి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ను దూరం పెట్టడమే తక్షణ కర్తవ్యంగా విజయమ్మ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయసాయిరెడ్డి మాత్రం అలాంటిదేమి లేదని బుకాయిస్తున్నారు.
Also Read: YSRCP Plenary-2022: జగన్ లోని ఆవేదనంతా ప్లీనరీలో ఇలా బయటపడింది
వైసీపీ ప్లీనరీకి విజయమ్మ వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ జగన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు వారి అలకకు కారణమని పార్టీ నేతలే ప్రకటిస్తున్నారు. అందరిని విమర్శించే జగన్ తన సొంత అమ్మ, చెల్లినే ఆదరించని నేతగా మిగులుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చంద్రబాబు తన మామకు గుండెపోటు వచ్చేందుకు కారకుడని అంటున్నా ఇప్పుడు జగన్ చేస్తుందేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో విజయమ్మ నిర్ణయం ఎటు వైపు దారి తీస్తుందోననే ఆందోళన పార్టీ నేతల్లో వస్తోంది.
విజయమ్మ తీరుతో వైసీపీ పరువు గంగలో కలవనుంది. ఆమె బాధ్యతల నుంచి తప్పుకుంటే పార్టీ భవితవ్యం గందరగోళంలో పడనుంది. ఆమె రాజీనామా చేస్తే ప్రతిపక్షాలకు మరో ఆయుధం లభించినట్లు అవుతుంది. అందుకే పార్టీ నేతలు హైరానా పడుతున్నారు. విజయమ్మ నిర్ణయంతో వైసీపీ డోలాయమానంలో పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయమ్మ పార్టీకి రాజీనామా చేస్తే జగన్ చిక్కుల్లో పడతారని తెలుస్తోంది. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఏం చెబుతారని ప్రశ్నించే అవకాశముంది. దీనిపై జగన్ ఏం చెప్పలేక పోయే పరిస్థితి ఎదురవుతుందని పార్టీ వర్గాల ఆలోచన.
విజయమ్మ రాజీనామా చేయకుండా బతిమాలాలని భావిస్తున్నారు. విజయమ్మ చేత రాజీనామా చేసే యోచనను విరమింపజేయాలని చూస్తున్నట్లు సమాచారం. విజయమ్మ రాజీనామాతో పార్టీకి చేటు జరగకూడదే ఉద్దేశంతోనే పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె చేత రాజీనామా చేయనీయకుండా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
Also Read:Pawan Kalyan- Jagan Navaratnalu: జగన్ నవరత్నాలపై పవన్ కళ్యాణ్ ‘నవసందేహాలు’.. వైరల్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Ys vijayamma resigned from the post of honorary president of ycp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com