MP Avinash Reddy Vs YS Sunitha : అవినాష్ రెడ్డిని వదలని వైఎస్ సునీత.. ఎందుకంత పగ?

ఇప్పుడు అవినాష్ కు ముందస్తు బెయిల్ లభించడంతో ఎలాగైనా రద్దు చేయించాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు మెమో అందించారు. 

  • Written By: Dharma Raj
  • Published On:
MP Avinash Reddy Vs YS Sunitha : అవినాష్ రెడ్డిని వదలని వైఎస్ సునీత.. ఎందుకంత పగ?

MP Avinash Reddy Vs YS Sunitha : వివేకా హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఆయన కుమార్తె సునీత గట్టిగానే పోరాడుతున్నారు. హంతకులను ఎలాగైనా పట్టుకునేందుకు డాక్టర్ సునీత చూపిస్తున్న పట్టుదలను అభినందించాల్సిందే. అటు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో పాటు బెదిరింపులకు లొంగకుండా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. ఆమె వెనుక విపక్ష నేతలు ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఎలాగైతేనేం ఆమె గట్టిగానే నిలబడడం అభినందనీయమే. తాజాగా ఆమె మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ కు ముందస్తు బెయిల్ ఇచ్చిన వేళ..ఆమె కొన్ని అభ్యంతరాలను న్యాయస్థానం ముందు ఉంచినట్టు తెలుస్తోంది.

ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై ఈ నెల 27న విచారించారు. ఆ సమయంలో తన తల్లికి శస్త్రచికిత్స జరిగిందని.. తన తండ్రి ఇప్పటికే అరెస్టయినందు వల్ల అన్నీతానే చూసుకోవాల్సి వస్తోందని అవినాష్ రెడ్డి కోర్టుకు తన న్యాయవాది ద్వారా విన్నవించారు. సరిగ్గా ఈ పాయింట్ నే తీసుకొని అవినాష్ ను ఈ నెల 31 వరకూ అరెస్టు వద్దంటూ మధ్యంతర ఉత్వర్వులిచ్చారు. నిన్న ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే కోర్టుకు తెలిపినట్టు అనివాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదని.. ప్రసార మాధ్యమాల ద్వారా ఈ విషయం తెలిసిందని తెలంగాణ హైకోర్టుకు అవినాష్ లాయర్ మెమో అందించారు. ఆమె శస్త్రచికిత్స నిర్ధారించడానికి రికార్డులు లేవని.. తప్పుడు సమాచారం అయితే అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవడంతో పాటు ముందస్తు బెయిల్ రద్దుచేయాలని సునీత న్యాయవాది కోరారు. ఈ మెమోను జడ్జి స్వీకరించారు.

వివేకా హత్యలో ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి పాత్ర ఉందని సునీత బలంగా నమ్ముతున్నారు. అందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. భాస్కర్ అరెస్టు అవ్వగా మిగిలింది అవినాష్ మాత్రమే. తనను సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎంపీ హైకోర్టులో పిటీషన్ వేశారు. వెంటనే సునీత అభ్యంతరం చెబుతు ఇంప్లీడ్  పిటీషన్ వేశారు. ఇప్పుడు అవినాష్ కు ముందస్తు బెయిల్ లభించడంతో ఎలాగైనా రద్దు చేయించాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు మెమో అందించారు.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు