Pawan Kalyan- YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్నారా? తెలంగాణలో సుదీర్ఘ కాలం పాదయాత్ర చేస్తున్నప్రజలు పట్టించుకోకపోవడంతో ఆమె పునరాలోచనలో పడ్డారా? ఆవేశపూరిత మాటలు అందులో భాగమేనా? మంగళవారం నాటి ఎపిసోడ్ అందులో భాగమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. తన సోదరుడు జగన్ ను విభేదించి మరీ షర్మిళ వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినట్టు వార్తలు వచ్చాయి. వైఎస్సార్ కుటుంబంలో చీలికలు వచ్చినట్టు కామెంట్స్ వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి వైసీపీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. అటు కుమార్తె షర్మిళకు అండదండగా నిలుస్తున్నారు. అయితే షర్మిళ అనుకున్నట్టు తెలంగాణలో పార్టీకి మైలేజ్ రావడం లేదు. దీంతో తండ్రి పాదయాత్ర బాటను ఎంచుకున్నారు. గత కొన్ని నెలలుగా పాదయాత్ర చేస్తున్నారు. కానీ జనాల నుంచి అంత రెస్పాన్స్ లేదు.

Pawan Kalyan- YS Sharmila
అయితే ఏపీ విషయానికి వచ్చేసరికి విపక్షంలో జనసేన అత్యంత దూకుడుగా ఉంది. పవన్ కళ్యాణ్ అధికార వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రజల ఆలోచనల్లో మార్పు తెస్తున్నారు. అటు రాష్ట్రస్థాయి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. వైసీపీ పాలకుల తీరుపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో జనసేనకు ఏపీలో మంచి మైలేజ్ వస్తోంది. అటు ఇప్పటం ఎపిసోడ్ లో పవన్ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ప్రభుత్వంపై ఆయన రియాక్టయిన తీరు అందర్ని ఆకర్షించింది. బాధితులను పరామర్శించేందుకు ఆయన కారుపై ఎక్కిన తీరు, వెంట కాన్వాయ్, ఆపై జనసైనికులు వాహనాలతో ఫాలో అవ్వడం.. ఇవన్నీ అధికార పార్టీ నేతల గుండెల్లో వణుకు పుట్టించాయి. పవన్ ఈ ఇష్యూను ఇంతటితో వదలడని కూడా భావించారు. వారు ఊహించినట్టే ఇప్పటం ఇష్యూను రేజ్ చేసి అధికార పార్టీని పవన్ డ్యామేజ్ చేయగలిగారు.
పవన్ ను స్ఫూర్తిగా తీసుకున్నారేమో కానీ .. అలాగే చేస్తే పోలే అని అనుకున్నట్టున్నారు..వైఎస్ షర్మిళ కూడా అదే స్థాయిలో దూకుడును కనబరచాలనుకున్నారు. కానీ టీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఆ పార్టీ శ్రేణులు రియాక్టు కావడం, పరిస్థితి ఉద్రిక్తంగా మారడం, పోలీసులు ఎంటరై అరెస్ట్ కు సిద్ధపడడం… షర్మిళ కారులోనే గంటల తరబడి ఉండిపోవడం.. క్రేన్ సాయంతో షర్మిళ కారును తరలించడం.. అంతా పక్కా పొలిటికల్ ప్లాన్ గా నడిచినట్టు కనిపించింది. షర్మిళకు కావాలనే హైప్ చేసేందుకు టీఆర్ఎస్ ఎత్తుగడగా రాష్ట్రంలోని మిగతా రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. మధ్యలో వైఎస్ విజయలక్ష్మి ఎంట్రీ.. ఇదంతా ముందస్తు వ్యూహంలో భాగమేనన్న టాక్ నడుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును వైఎస్సార్ తెలంగాణ పార్టీకి మళ్లించే ఎత్తుగడగా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Pawan Kalyan- YS Sharmila
నిన్నటి ఎపిసోడ్ లో షర్మిళ కొంతవరకూ సక్సెస్ అయినా.. అదంతా టీఆర్ఎస్ సాయంతోనే అన్న టాక్ నడుస్తోంది. పవన్ తో పోలిస్తే షర్మిళ పోరాటం తేలిపోయింది. ఒక్క ఇప్పటం ఇష్యూతో వైసీపీ ప్రభుత్వాన్నే షేక్ చేశారు. అటు ప్రభుత్వం, ఇటు పార్టీలో కీలకమైన సజ్జల రామక్రిష్ణారెడ్డిని ఉతికి ఆరేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తానని హెచ్చరించారు. మరి షర్మిళ ఆ స్థాయిలో మాట్లాడినావాటికి అంత ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎందుకంటే ఏపీలో జనసేన మాదిరిగా.. తెలంగాణ వైఎస్సార్ టీపీకి ఆదరించిన ప్రజలు లేరు. పైగా ఆమె ఏపీ సీఎం జగన్ సోదరి. జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. రాజకీయ మిత్రుడు. అటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు షేరు చీల్చేందుకే షర్మిళను తెరపైకి తెచ్చారన్న ప్రచారమూ ఉంది. అందుకే షర్మిళ ఎంతగా ఆవేశంతో మాట్లాడినా.. గంటల తరబడి కారులో కూర్చొని ఆందోళన చేసినా తెలంగాణ సమాజం పట్టించుకోవడం లేదు. పవన్ లా అనుకరించాలన్న షర్మళ ప్రయత్నం అంతగా వర్కవుట్ కాలేదన్న టాక్ అయితే తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోంది.