YS Sharmila Son Raja Reddy: వైఎస్ రాజారెడ్డి జూనియర్ ను చూసారా?

కడప విమానాశ్రయం నుంచి నేరుగా వేంపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లిన షర్మిల ఇడుపులపాయలో తన పేరుతో ఉన్న 9.53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డిపేరుతో రిజిస్ట్రేషన్‌ చేశారు.

  • Written By: Raj Shekar
  • Published On:
YS Sharmila Son Raja Reddy: వైఎస్ రాజారెడ్డి జూనియర్ ను చూసారా?

YS Sharmila Son Raja Reddy: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు చాలా రోజుల తర్వాత పులివెందుల వెళ్లారు. తల్లి విజయమ్మ, కొడుకు రాజారెడ్డి, కూతురు అంజలిరెడ్డితో కలిసి శుక్రవారం ఇడుపులపాయ వెళ్లారు. జూలై 8న వైఎస్సార్‌ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్లారు. పనిలో పనిగా అక్కడ తనకు సంబంధించిన భూములను కొడుకు, కూతురు పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. అయితే షర్మిల తన కొడుకుతో ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

భూముల రిజిస్ట్రేషన్‌..
కడప విమానాశ్రయం నుంచి నేరుగా వేంపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లిన షర్మిల ఇడుపులపాయలో తన పేరుతో ఉన్న 9.53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డిపేరుతో రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇడుపులపాయ ఎస్టేట్‌ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుంచి షర్మిల కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కుమార్తె అంజలిరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. అనంతరం షర్మిల కుటుంబ సభ్యులు వేంపల్లి రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకున్నారు.

YS Sharmila Son Raja Reddy

YS Sharmila Son Raja Reddy

సినిమా హీరోలా..
షర్మిల కొడుకును చూసి చాలామంది ఇంతపెద్ద కొడుకు ఉన్నాడా అంటున్నారు. ఇటీవలే గ్రాడ్యుయేషన్‌ డేలో కూడా షర్మిల పాల్గొన్నాడు. ఈ సందర్భంగా షర్మిల తన కొడుకుతో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. తాజాగా కడప విమానాశ్రయంలో కొడుకుతో కలిసి నడిచి వెళ్తున్న ఫొటోలు షేర్‌ చేసింది. మంచి హైట్, హ్యాండ్సమ్‌గా ఉన్న జూనియర్‌ రాజారెడ్డిని చూసి చాలా మంది హీరోలా ఉన్నాడని అంటున్నారు.

జూనియర్‌ రాజారెడ్డి అంటూ కామెంట్స్‌..
తల్లి షర్మిలతో కలిసి ఉన్న ఆమె కొడుకు రాజారెడ్డి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. జగన్‌ కొడుకు రాజారెడ్డి, వైఎస్సార్‌ వారసుడు అవుతాడు కానీ షర్మిల కొడుకు ఎలా వారసుడని ప్రశ్నించారు. కొంతమంది జూనియర్‌ ప్రభాస్‌ అని, ప్రభాస్‌ అంత హైట్‌ ఉన్నాడని, జూనియర్‌ బాహుబలి అని, పులి బిడ్డ మనుమడు అని రాజారెడ్డి బాహుబలి అని కామెంట్స్‌ పెడుతున్నారు. సాహో రాజారెడ్డి అని మరికొందరు కామెంట్‌ చేశారు. కటౌట్‌ అదిరిందని మరొకరు పోస్టు పెట్టాడు.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు