Rajareddy : హీరోగా వైఎస్ జగన్ మేనల్లుడు రాజారెడ్డి… డైరెక్టర్ ఎవరంటే?

అమెరికాలోని డల్లాస్ లో రాజారెడ్డి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇక చదువు చాలు సినిమా హీరోగా ఎదగాలనుకుంటున్నాడట.

  • Written By: Shiva
  • Published On:
Rajareddy : హీరోగా వైఎస్ జగన్ మేనల్లుడు రాజారెడ్డి… డైరెక్టర్ ఎవరంటే?

Rajareddy : సినిమా హీరో కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే సక్సెస్ అయ్యేది కొందరే. హీరోగా ఎదిగితే ఆ నేమ్, ఫేమ్, స్టార్డం ఓ రేంజ్ లో ఉంటాయి. సన్మానాలు, సత్కారాలు లభిస్తాయి. హీరోలు సొసైటీకి రోల్ మోడల్ గా ఉంటారు. చెప్పాలంటే హీరోలను ప్రత్యక్ష దైవాలుగా పూజించే అభిమానులు ఉన్నారు. కోట్ల సంపాదన వద్దన్నా వచ్చి పడుతుంది. ఇంకా దశ తిరిగితే సీయమ్మో పీయమ్మో ఐపోవచ్చు. హీరో అయితే ఒనగూరే ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. అందుకే నటుల వారసులే కాకుండా దర్శక నిర్మాతలు, వ్యాపారవేత్తలు, పొలిటీషియన్స్ పిల్లలు కూడా హీరోలుగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 

 
కాగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుండి హీరో వస్తున్నాడనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. సీఎం జగన్ మేనల్లుడు, షర్మిల కుమారుడైన రాజారెడ్డి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సర్వం సిద్ధమవుతున్నాడంటూ ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. షర్మిల కొడుకు ఒడ్డు పొడుగు రూపంలో హీరో మెటీరియల్. చక్కని శరీర ధారుడ్యం కూడా సాధించాడు. చూడగానే హీరోలా ఉన్నాడే అనిపించే కట్ అవుట్. 
 
దీంతో షర్మిల కొడుకును హీరోగా లాంచ్ చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలో దర్శకుడు పూరి జగన్నాధ్ తో చర్చలు కూడా జరిగాయట. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ రాజారెడ్డితో చేయాలనుకుంటున్నాడట. స్క్రిప్ట్ పట్ల షర్మిల ఫ్యామిలీ సంతృప్తిగా ఉండగా పూరి-రాజారెడ్డి కాంబోలో మూవీ పట్టాలెక్కడం ఖాయం అంటున్నారు. అమెరికాలో చదువుకుంటున్న రాజారెడ్డి హీరో కావడానికి అవసరమైన శిక్షణ తీసుకున్నాడట. 
 
అతడు యాక్టింగ్ కోర్స్ చేశాడట. జిమ్ చేసి పర్ఫెక్ట్ బాడీ మైంటైన్ చేస్తున్నాడు. అమెరికాలోని డల్లాస్ లో రాజారెడ్డి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇక చదువు చాలు సినిమా హీరోగా ఎదగాలనుకుంటున్నాడట. రాజారెడ్డి లాంచింగ్ భారీగా ఉండనుందట. ఏదో ఆషామాషీగా కాకుండా పరిశ్రమలో ఓ స్థాయికి ఎదిగేలా గట్టి ప్రణాళిక వేస్తున్నారని సమాచారం. కాగా మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసింది పూరి జగన్నాధ్ కావడం విశేషం. 

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు