Pawan Vs YS Jagan : పవన్ ఓటమికి.. జగన్ పక్కా ప్లాన్

గత ఎన్నికల్లో పవన్ ను దూరం చేసుకున్నామన్న సాఫ్ట్ కార్నర్ గాజువాక ఓటర్లలో కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో జగన్ ప్రయత్నాలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి మరీ.

  • Written By: Dharma Raj
  • Published On:
Pawan Vs YS Jagan : పవన్ ఓటమికి.. జగన్ పక్కా ప్లాన్

Pawan Vs YS Jagan : పవన్ అంటేనే జగన్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. వైసీపీ విముక్త ఏపీ అంటూ పవన్ తరచూ సంభోదించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం వైసీపీని ఓడించేందుకు అందరితో కలుస్తానని చెప్పడాన్ని సహించలేకపోతున్నారు. ముఖ్యంగా చంద్రబాబును సీఎం చేసేందుకు పావులు కదుపుతున్నారని అనుమానిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో పవన్ ను చావుదెబ్బ కొట్టాలని డిసైడయ్యారు. పవన్ ఎక్కడ నుంచి పోటీచేసినా అక్కడ ఓడించాలని తీర్మానించుకున్నారు. పవన్ ఎంచుకున్న నియోజకవర్గాలపై ఫోకస్ పెంచనున్నారు. పవన్ ఓటమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

గత ఎన్నికల్లో ఓటమి..
గత ఎన్నికల్లో పవన్ గాజువాక, భీమవరంలో పోటీచేశారు. రెండుచోట్ల ఓడిపోయారు. అయితే ఈసారి నియోజకవర్గాల ఎంపిక పక్కాగా చేయనున్నారు. టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఉభయతారకంగా ఉండే నియోజకవర్గాన్ని ఎంపిక చేయనున్నారు. అయితే ఆయన గాజువాక నుంచే మరోసారి బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే జనసేన కీలక నాయకులు నాగబాబు, నాదేండ్ల మనోహర్ తరచూ విశాఖ జిల్లాలో పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణులను అలెర్ట్ చేస్తున్నారు. అటు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పవన్ కూడా గాజువాక వైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.

భారీగా ఇళ్ల సంతర్పణ..
అయితే దీనిపై సమాచారమందుకున్న జగన్ గాజువాకలో పవన్ ను మరోసారి మట్టికరిపించాలని గట్టి నిర్ణయానికి వచ్చారు. త్వరలో జగన్ గాజువాకలో ల్యాండ్ అవబోతున్నారు. అక్కడ ఇరవై వేల మందికి ఇళ్ళ పట్టాలను పంచబోతున్నారు. ఏపీఐఐసీ. గాజువాక హౌస్ కమిటీ గుర్తించిన ఈ పేదలందరికీ పట్టాలు జగన్ పంపిణీ చేయనున్నారు. గాజువాకలో ఇరవై వేల మందికి ఇళ్ళ పట్టాలు అంటే చాలా భారీ కార్యక్రమం కిందనే చూడాలి. రెండు లక్షల మంది ఓటర్లు ఉన్న గాజువాకలో ఇరవై వేల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు అంటే కుటుంబ సభ్యులతో కలుపుకున్న యాభై నుంచి అరవై వేల మంది దాకా ఉన్న ఓటర్ల మీద ఇది బ్రహ్మాస్త్రం అని అన్న మాట.

వైసీపీ అభ్యర్థి మార్పు..
ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో పవన్ పై భారీ మెజార్టీతో గెలుపొందారు. త్రిముఖ ఫైట్ తో చీలిన ఓట్లతో వైసీపీ అభ్యర్థి సునాయాసంగా గెలిచారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉండనుండడంతో ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి బరిలో దిగే అవకాశముంది. అయితే ఈ సారి ఇక్కడ కాపులకు కానీ.. యాదవులకు కానీ టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. పవన్ కానీ బరిలో దిగితే కచ్చితంగా అభ్యర్థిని మార్చుతారు. అదే సమయంలో భారీ సంక్షేమ పథకాలు, అభివృద్ధితో గాజువాక ప్రజల మనసు డైవర్ట్ కాకుండా కట్టడి చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో పవన్ ను దూరం చేసుకున్నామన్న సాఫ్ట్ కార్నర్ గాజువాక ఓటర్లలో కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో జగన్ ప్రయత్నాలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి మరీ.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు