Youtube 2022 Trends: 2022 వ సంవత్సరం మరో పాతిక రోజుల్లో ముగియబోతుంది.. ఈ ఏడాది ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.. ఈ సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ పాటలు ఉన్నాయి.. కానీ కొన్ని పాటలకు మాత్రం యూట్యూబ్ లో వందల కొద్ది మిలయన్ వ్యూస్ వచ్చిన సాంగ్స్ కొన్నే ఉన్నాయి.. వాటిల్లో టాప్ 10 హైయెస్ట్ వ్యూస్ వచ్చిన సాంగ్స్ లిస్ట్ ని ఇటీవలే యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది.. వాటిల్లో అల్లు అర్జున్ పుష్ప, మరియు విజయ్ బీస్ట్ సినిమాలోని పాటలకి అత్యధిక ఓట్లు వచ్చాయి.. యూట్యూబ్ విడుదల చేసిన ఆ టాప్ 10 సాంగ్స్ లిస్ట్ ఏమిటో ఒక లుక్ వేద్దాం.

Youtube 2022 Trends
1.) శ్రీవల్లి(పుష్ప):
పుష్ప మూవీ నుండి విడుదలైన ఈ పాట ఇండియా వైడ్ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. క్రికెటర్స్ దగ్గర నుండి సినీ నటుల వరుకు ప్రతి ఒక్కరూ ఈ పాటకి డాన్స్ వేస్టు రీల్స్ చేసేవారు.. అందుకే ఈ పాట అత్యధిక వ్యూస్ తో నెంబర్ 1 స్థానం లో నిలిచింది.
2.) అరబిక్ కుత్తు(బీస్ట్):
విజయ్ హీరో గా నటించిన ఈ సినిమాకి నెల్సన్ దర్శకత్వం వహించగా, అనిరుధ్ సంగీతం అందించారు.. ఈ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీలోని ఈ పాటకి సోషల్ మీడియా నుండి సెన్సెషనల్ రెస్పాన్స్ వచ్చింది.. అందుకే ఈ పాట రెండవ స్థానం లో నిలిచింది.
3.) సామి సామి (పుష్ప):
పుష్ప మూవీ నుండి వైరల్ అయిన మరో సెన్సేషనల్ సాంగ్ ఇది.. ఈ పాటలో హీరోయిన్ రష్మిక వేసిన స్టెప్స్ ని ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది రీల్స్ చేసారు..అందువల్ల ఈ సాంగ్ కి వ్యూస్ లో వందల మిలియన్ వ్యూస్ వచ్చాయి.
4.) కచ్చా బాధం( ప్రైవేట్ ఆల్బమ్):
ఆర్కే బృందం సంగీతం అందించిన ఆల్బమ్ ఇది..భువన్ బాధ్యకర్, అమిత్ దూల్, నిషా భట్ ఈ సాంగ్ లో నటించారు.. అప్పట్లో పెద్ద హిట్ అయిన కచ్చా బాధం రేమిక్స్ చెయ్యగలరు యూట్యూబ్ లో ఈ సాంగ్ వందల మిలియనలా వ్యూస్ వచ్చాయి.

Youtube 2022 Trends
5.) లే లే ఆయూ కొకకోలా (ప్రైవేట్ ఆల్బమ్) :
యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ రప్పించుకున్న మరో ప్రైవేట్ ఆల్బమ్ ఇది..సర్వింద్ మలహార్ ఈ ఆల్బమ్ కి సంగీత దర్శకత్వం వహించారు.
6.) ఊ బోల్ గయా.. ఊహు బోల్ గయా (పుష్ప):
పుష్ప నుండి యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ రప్పించుకున్న మూడవ సినిమాలు ఇది.. తెలుగు లో ‘ఊ అంటావా మావా..ఊహు అంటావా మావా’ పాట ఇది.. తెలుగులో కంటే హిందీలోనే ఈ పాట పెద్ద హిట్ అయ్యింది.. సమంత డాన్స్ కి నార్త్ ఇండియన్స్ మెంటలెక్కిపోయారు.
7.) ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావ (పుష్ప ):
పుష్ప నుండి అత్యధిక వ్యూస్ ని రప్పించుకున్న మరో వీడియో సాంగ్ ఇది..ఒకే పాట టాప్ 10 లో రెండు సార్లు రావడం విశేషం.

Youtube 2022 Trends
8.) కోక్ స్టూడియో ఆల్బమ్:
అలీ సేది,జూల్ఫీ ఈ ఆల్బమ్ ని కంపోజ్ చేసారు.. ఈ ఏడాది అత్యధిక వ్యూస్ రప్పించుకున్న మూడవ ఆల్బమ్ గా నిలిచింది.
9.) అరబిక్ కుత్తు (వీడియో సాంగ్ ):
లిరికల్ వీడియో అత్యధిక వ్యూస్ తో రెండవ స్థానం లో నిలవగా.. వీడియో సాంగ్ కూడా అదే రేంజ్ వ్యూస్ ని సొంతం చేసుకొని టాప్ 10 లో ఉండడం విశేషం.. విజయ్ మరియు పూజ హెగ్డే వేసిన అద్భుతమైన డాన్స్ వల్లే అన్ని వ్యూస్ వచ్చాయి.
10.) కేసరి లాల్ (ప్రైవేట్ ఆల్బమ్):
కాన్హాయా కుమార్ యాదవ్ కంపోజ్ చేసిన ఈ పాట యూట్యూబ్ ని ఒక ఊపు ఊపేసింది