Honor Killing In Hyderabad: మనిషిలో రాక్షసత్వం పెరుగుతోంది. సాటి వారిని చంపాలనే ఆలోచన ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. తమ కూతురును వేరే కులం వాడు పెళ్లి చేసుకున్నాడనే నెపంతో అతడిని దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. దీనికి బాలిక బంధువులే పాల్పడటం తెలిసిందే. హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఈ రక్తపాతం అందరిలో ఆగ్రహం కలిగిస్తోంది. కూతురు కట్టుకున్న వాడినే అన్యాయంగా పొట్టన పెట్టుకోవడంతో ఇక ఆమెకు దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడటం పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Niraj
మార్వాడీ అయిన మహేందర్ పర్వాన్ కుటుంబంతో కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి బేగంబజార్ లోని కొల్సావాడి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పల్లీల హోల్ సేల్ వ్యాపారం చేసే నీరజ్ పర్వాన్ (25) తండ్రికి సాయంగా ఉండేవాడు. ఇదే క్రమంలో అదే ప్రాంతంలో ఉంటున్న సంజనత పరిచయం ఏర్పడింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన సంజన తల్లిదండ్రులు ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.
Also Read: Nara Lokesh: రూటు మార్చిన లోకేష్ .. పవన్ స్టైల్, బాలయ్య డైలాగ్స్
సంజన, నీరజ్ ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆమెను మరిచిపోవాలని హెచ్చరించారు. అయినా నీరజ్ మానుకోలేదు. సంజనను తీసుకుపోయి ఆర్యసమాజ్ లో వివాహం చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి రెండు నెలలు దూరంగా వెళ్లిపోయారు. సంజన గర్భవతి కావడంతో తిరిగి వచ్చారు. తమ కూతురును ప్రేమ వివాహం చేసుకున్నాడనే కోపంతో సంజన రగిలిపోయేవారు. సంజన కుటుంబసభ్యులు అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరుకుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించి వారు మేజర్లు కావడంతో ఏం చేయొద్దని సూచించారు.

Niraj
అప్పటి నుంచి నీరజ్ ను చంపాలని సంజన తల్లిదండ్రులు పథకం వేశారు. నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. శుక్రవారం రాత్రి స్కూటీపై వస్తున్న నీరజ్ ను వెంబడించారు. నీరజ్ ఇంటి సమీపంలోకి రాగానే బైకుతో ఢీకొట్టి కింద పడగానే కత్తులతో 20 సార్లు పొడిచి తరువాత గ్రానైట్ రాయి మీద పడేసి కొట్టారు. దీంతో చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సమాచారం అందుకున్న షాహినాయథ్ గంజ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించి బైకులు, వ్యక్తులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నీరజ్ పై కక్ష పెంచుకున్న సంజన కుటుంబ సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Also Read:Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణలో జగన్ సర్కారు సహాయ నిరాకరణ.. చేతులెత్తేసిన సీబీఐ