Shocking Love Story: వేపకాయంత వెర్రి వేయి రకాలుంటందంటారు. అది ఎవరికి ఏ విధంగా ఉంటుందో తెలియదు. కొందరికి డబ్బు మీద, మరికొందరికి మద్యం మీద, ఇంకొందరికి మగువల మీద ఉండటం తెలిసిందే. వెర్రి ఉంటే వారిని దారికి తెచ్చుకోవడం కష్టమే. వారు అనుకున్నదే చేస్తారు. వారి ఇష్టానుసారంగానే ప్రవర్తిస్తారు. నేనే నెంబర్ వన్ అని అనుకుంటారు. అలాగే ప్రవర్తిస్తుంటారు. కానీ కొందరి ప్రవర్తన మాత్రం విచిత్రంగా ఉంటుంది. తమ జీవితం ఏమైపోతోందనే ఆలోచన కూడా వారికి రాదు. తాను కోరుకున్న వ్యక్తి కోసం ఎంతకైనా తెగించి తన ప్రేమను వ్యక్తం చేయడం చూస్తూనే ఉంటాం. ఇక్కడ అలాంటి ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది.

Shocking Love Story
అసోం రాష్ట్రంలోని సువల్ కచి గ్రామానికి చెందిన ఓ యువతి (19) పక్క గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ప్రేమ ముదిరింది. దీంతో ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. ఇద్దరిది పవిత్ర ప్రేమగా భావించుకున్నారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ వచ్చింది. ఆ యువకుడికి హెచ్ఐవీ ఉంది. దీంతో తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. అయినా వినకుండా వారు మూడు సార్లు ఇంట్లో నుంచి పారిపోయారు. తల్లిదండ్రులు వెతికి తీసుకొచ్చి వేరుగా ఉంచారు.
Also Read: MP Gorantla Madhav Issue: గోరంట్ల మాధవ్ పై చర్యలకు మీనమేషాలు ..వైసీపీకి తప్పదు భారీ మూల్యం
అయినా ఆ యువతిలో ఎలాంటి మార్పు రాలేదు. తనకు అతడే కావాలని పట్టుబట్టింది. అతడి ఎడబాటును తట్లుకోలేకపోయింది. అతడే సర్వస్వం అని భావించింది. ఊరికే తమను వేరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తనను అతడి నుంచి వేరు చేయకుండా ఉండాలని ఓ దారుణమైన ఆలోచన చేసింది. ఆ యువకుడి రక్తాన్ని తనకు ఎక్కించుకుంది. దీంతో ఆమెకు కూడా ఎయిడ్స్ సోకినట్లే. అతడి కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తోంది. ఇలా ఎంత మంది ఉంటారు. నీ కోసం చచ్చిపోతానని చెప్పేవారే కానీ నిజంగా వెంట ఉండేవారు అరుదు.

Shocking Love Story
అలాంటి ఓ ప్రియురాలు తన ప్రియుడి కోసం తన జీవితాన్నిఅర్పించుకుంది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ యువకుడిని అరెస్టు చేశారు. కానీ ఆ యువతి చేసింది మాత్రం నిజంగా త్యాగమే. కానీ కలిసి బతకడానికి చేయాలి కానీ చనిపోవడానికి చేసేది త్యాగం కాదు. పిచ్చిపని అంటారు అందరు. అతడితో జీవితం పంచుకోవాలని అనుకుంది. అందుకు పెద్దలు అడ్డు చెప్పడంతో ఇక లాభం లేదనుకుని అతడి రక్తం ఎక్కించుకుని తన జీవితాన్ని కూడా ముగించేందుకు నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది.
Also Read:Chandrababu- BJP: చంద్రబాబుకు బీజేపీ స్నేహహస్తం.. మొత్తబడుతున్న కేంద్ర పెద్దలు